ETV Bharat / sports

'రెండో మ్యాచ్​లో గెలవాలంటే వారిని ఆడించండి'

IND vs SA ODI: భారత్-దక్షిణాఫ్రికా మధ్య శుక్రవారం రెండో వన్డే జరగనుంది. తొలి మ్యాచ్​లో ఓడిన టీమ్ఇండియా ఈ వన్డేలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్​లో రాహుల్​సేన విజయం సాధించాలంటే జట్టులో కొన్ని మార్పులు చేయాలని అభిప్రాయపడ్డారు సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్.

IND vs SA Odi team, భారత్-దక్షిణాఫ్రికా వన్డే జట్టు
IND vs SA
author img

By

Published : Jan 21, 2022, 1:07 PM IST

IND vs SA ODI: భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శుక్రవారం కీలకమైన రెండో వన్డే మ్యాచ్‌ జరగనుంది. తొలి వన్డేలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుని సిరీస్‌ రేసులో నిలబడాలని కేఎల్‌ రాహుల్‌ నాయకత్వంలోని టీమ్‌ఇండియా భావిస్తుండగా.. వరుసగా రెండో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని సఫారీలు ఉవ్విళ్లూరుతున్నారు. తొలి వన్డేలో శిఖర్‌ ధావన్‌, విరాట్ కోహ్లీ, శార్దూల్‌ ఠాకూర్‌ అర్ధ శతకాలతో రాణించినా భారత్‌కు ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో మ్యాచ్‌ గెలవాలంటే టీమ్‌ఇండియా తుది జట్టులో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సీనియర్‌ క్రికెటర్‌ దినేశ్ కార్తీక్, మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డారు.

"భారత పేస్‌ దళంలో మార్పులు చేయాలి. ప్రసిధ్‌ కృష్ణ లేదా మహమ్మద్‌ సిరాజ్‌.. వారిద్దరిలో ఒకరు తుది జట్టులో ఉండాలి. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నారా.. లేదా భువనేశ్వర్‌ను పక్కన పెడతారా అనేది మేనేజ్‌మెంట్ ఇష్టం. సిరాజ్‌, ప్రసిధ్‌లలో ఎవరైనా సరే పదకొండు మందిలో ఉండాల్సిందే. వీరు జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నా. మధ్య ఓవర్లలో తప్పకుండా వికెట్లను పడగొట్టగలరు."

-దినేశ్ కార్తీక్, టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్

భారత మిడిలార్డర్ బలోపేతం కావాలంటే చిన్నపాటి మార్పులు చేస్తే సరిపోతుందని సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు. "బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఐదో స్థానంలో రిషభ్ పంత్‌, జట్టులో ఏ పాత్ర పోషిస్తున్నాడో తెలియని వెంకటేశ్ అయ్యర్‌ ఉండటం వల్ల టీమ్‌ఇండియా మిడిలార్డర్‌ బ్యాటింగ్‌ కాస్త బలహీనంగా ఉందనిపించింది. పొడిగా, మందకొడిగా ఉండే పిచ్‌పై ఓ యువ బ్యాటర్‌ ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు రావడం ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే సూర్యకుమార్‌ యాదవ్ లాంటి వారికి చోటు కల్పిస్తే బాగుంటుంది. తర్వాత అశ్విన్‌కు ఏడో స్థానంలో అవకాశం కల్పించవచ్చు. అందుకే మిడిలార్డర్‌ పటిష్ఠంగా ఉండాలంటే చిన్నచిన్న మార్పులు చేయాలి" అని సంజయ్‌ వివరించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: రోడ్ సేఫ్టీ సిరీస్​కు సచిన్ దూరం.. అదే కారణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.