Ind Vs Pak World Cup 2023 : క్రికెట్ మహా సంగ్రామంలో దాయాదుల యుద్ధానికి సమయం దగ్గరపడుతోంది. వరల్డ్ కప్ 2023లో భాగంగా నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు గుజరాత్.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సిద్ధమైంది. శనివారం (అక్టోబర్ 14) జరిగే ఈ మ్యాచ్‌కు అధికారులు కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఈమెయిల్ రావడం వల్ల మరింత అప్రమత్తమైన పోలీసులు.. మ్యాచ్ జరిగే రోజు నగరాన్ని తమ గుప్పెట్లోకి తీసుకోనున్నారు.
11 వేల మందితో సెక్యూరిటీ..
India Pakistan Match 2023 Venue : మ్యాచ్ జరుగుతున్న అహ్మదాబాద్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నామని అహ్మదాబాద్ కమిషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు. స్థానిక పోలీసులు, హోమ్ గార్డులతోపాటు నేషనల్ సెక్యూరిటీ గార్డ్- ఎన్ఎస్‌జీ కమాండోలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దించి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామన్నారు. 7000 వేల మంది పోలీసులతో పాటు మరో 4000 మంది హోంగార్డులను మోహరిస్తున్నామని తెలిపారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు, స్టేడియం పరిసరాల్లో.. నగరంలోని సున్నిత ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మొత్తం 11 వేల మందికి పైగా భద్రతా సిబ్బందితో ఆ రోజు నగరం మొత్తం పోలీసులు ఆధీనంలోకి వెళ్లిపోనుంది.
న్యూక్లియర్ దాడులను తట్టుకునేలా..
India Pakistan Match Security : లక్ష మందికి పైగా ప్రేక్షకులు ఈ మ్యాచ్ చూడటానికి వస్తున్న నేపథ్యంలో అదే స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జీఎస్ మాలిక్ తెలిపారు. అయితే గత 20 ఏళ్ల కాలంలో అహ్మదాబాద్‌లో క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని ఆయన గుర్తు చేశారు. భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా చేసిన భద్రతా ఏర్పాట్ల గురించి మీడియాకు మాలిక్ వివరించిన మాలిక్.. కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ (సీబీఆర్ఎన్) వంటి దాడులు జరిగినా వెంటనే స్పందించేలా భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాలను కూడా మోహరిస్తున్నట్లు తెలిపారు. అదనంగా 3 'హిట్ టీమ్స్', ఒక ఎన్ఎస్‌జీ 'యాంటీ-డ్రోన్ టీమ్', 9 'బాంబ్ డిటెక్షన్&డిస్పోజల్ స్క్వాడ్'లను మోహరిస్తున్నామని తెలిపారు. ఈ సిబ్బందిని నలుగురు ఇన్స్పెక్టర్ జనరల్- ఐజీలు, డిప్యూటీ ఐజీలతో పాటు 21 మంది డీసీపీలు పర్యవేక్షిస్తారని తెలిపారు.
Asia cup 2023 Ind VS Pak : భారత్ వర్సెస్ పాక్.. ఎవరి బౌలింగ్ ఎలా ఉందంటే?