Ind Vs Pak World Cup 2023 : అహ్మదాబాద్ వేదికగా జరగనున్న భారత్- పాక్ ప్రపంచ కప్ పోరుకు ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. టిక్కెట్ల అమ్మకం నుంచి రూమ్స్ అద్దె వరకు అన్నీ సగటు క్రికెట్ అభిమానిని ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక పోరుకు ఇంకా 25 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున.. ఫ్యాన్స్ కూడా అహ్మదాబాద్‌కు పయనమయ్యేందుకు రెడీగా ఉన్నారు. అయితే ఈ మ్యాచ్ చూసేందుకు భారీ స్థాయిలో అభిమానులు వల్ల అక్కడి హోటళ్ల ధరల్లోనూ మార్పులు జరిగాయి. ఇక ఇదే విషయాన్ని అదునుగా చేసుకున్న వ్యాపారస్థులు.. ఇప్పటికే హోటళ్ల ధరలను అమాంతం పెంచేసిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా అహ్మదాబాద్ ఫ్లైట్ టిక్కెట్ల ధర కూడా అమాంతం పెరిగిపోయిందట. అసలు ఛార్జీలు రూ.5,000 - రూ.12,000 ఉండగా.. దానికంటే 104 శాతం నుంచి 415 శాతం ఎక్కువ వసూలు చేస్తున్నారట. దీంతో మ్యాచ్ చూసేందుకు విమాన ప్రయాణం చేయనున్న అధికారులు ఒక్కసారిగా కంగు తిన్నారు. డిమాండ్‌కు తగ్గట్లుగా కావాల్సినన్ని ఫ్లైట్లు అందుబాటులో లేకపోవడం కూడా ఈ ధరల పెరుగుదలకు ఓ కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
World Cup 2023 Inaugural Match : అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచకప్‌నకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ నిర్వహణకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మెగా టోర్నీ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ఈ పోరుకు అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదిక కానుంది.
Golden Ticket World Cup 2023 : అయితే వరల్డ్ కప్‌లో బీసీసీఐ..'గోల్డెన్ టికెట్స్ ఫర్ ఇండియా ఐకాన్స్' అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా భారతరత్న సచిన్ తెందూల్కర్, బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ గోల్డెన్ టికెట్ అందజేశారు. అయితే ఈ గోల్డెన్ టికెట్ అందుకున్న వారు, ప్రపంచకప్‌లోని అన్ని మ్యాచ్‌లను స్టేడియంలో ప్రత్యక్షంగా.. వీఐపీ బాక్స్‌లో కూర్చొని వీక్షించవచ్చు. అంతేకాకుండా ఈ టికెట్‌పై.. వారికి వీఐపీ వసతులన్నింటినీ కల్పిస్తారు. ఈ క్రమంలో సచిన్, అమితాబ్‌కు ఈ టికెట్ అందింది. ఇక మున్ముందు ఈ గోల్డెన్ టికెట్లను దేశంలోని ఆయా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ICC World Cup History : 10 జట్లు.. ఒకే వరల్డ్ కప్.. ఎవరు తయారు చేశారో తెలుసా?.. కాస్ట్ ఎంతంటే?
World Cup 2023 Prize Money : వామ్మో.. వరల్డ్ కప్ విజేత 'ప్రైజ్‌మనీ' ఎంతో తెలిస్తే షాకే!