ETV Bharat / sports

టీమ్​ఇండియా బోణీ.. పాక్​పై ఘన విజయం - మహిళల ప్రపంచ కప్​ 2022

Worldcup 2022 ind vs pak match: ఐసీసీ మహిళల ప్రపంచకప్​లో భారత్​ క్రికెట్​ జట్టు బోణీ కొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​పై 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

india pak match
women world cup
author img

By

Published : Mar 6, 2022, 1:23 PM IST

Updated : Mar 6, 2022, 1:56 PM IST

Worldcup 2022 ind vs pak match: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్​లో టీమ్​ఇండియా శుభారంభం చేసింది. ఈ మెగాటోర్నీలో భాగంగా నేడు పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో మన అమ్మాయిలు ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి జట్టుపై 107 పరుగుల తేడాతో గెలిచారు.

245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్​ జట్టు బ్యాటర్లు తడబడ్డారు. కేవలం 137 పరుగులకే ఆలౌటయ్యారు. పాక్​ ఓపెనర్​ సిద్రా అమీన్​(30) టాప్ స్కోరర్​గా నిలిచింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం వల్ల మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. రాజేశ్వరి గైక్వాడ్​ 4, ఝలన్​ గోస్వామి, స్నేహ్​ రానా తలో రెండు, దీప్తి శర్మ, మేఘనా సింగ్​ తలో ఒక్క వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న భారత్​ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 244 పరుగులు సాధించింది. పూజా వస్త్రాకర్​(67), స్నేహ్​ రానా(53*), స్మృతి మంధాన(52) అర్ధ శతకాలతో రాణించారు.

ఇదీ చదవండి: IND VS SL: జడేజా మాయాజాలం.. 174కే లంక ఆలౌట్​

Last Updated : Mar 6, 2022, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.