ETV Bharat / sports

Ind vs Pak Asia Cup 2023 Match Watch Live For Free : ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్.. మీ ఫోన్లో ఫ్రీగా వీక్షించండి! - ఫోన్​లో ఫ్రీగా భారత్ పాకిస్థాన్ మ్యాచ్ 2023

IND vs PAK Live Match on Mobile : ఆసియా కప్​లో అసలు సిసలైన సమరానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది సేపట్లో భారత్-పాకిస్థాన్ మధ్య రసవత్తర పోరు మొదలు కానుంది. ఈ క్రికెట్ యుద్ధానికి.. అభిమానులు ఈగర్​గా వెయిట్ చేస్తున్నారు. కానీ.. అందరికీ టీవీల్లో మ్యాచ్ చూడడం సాధ్యం కాదు. అయినా.. బాధపడాల్సిన పనిలేదు. మీ మొబైల్లోనే మీరు ఉన్న చోటు నుంచే మ్యాచ్ ను ఇలా చూసేయండి.

IND vs PAK Live Match on Mobile
IND vs PAK Live Match
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 8:06 PM IST

Updated : Sep 2, 2023, 2:17 PM IST

IND vs PAK Asia Cup Live Match on Mobile : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2023 ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆగష్టు 30వ తేదీ బుధవారం రోజు అట్టహాసంగా మొదలైన ఈ టోర్నీ సెప్టెంబర్ 17 వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ తర్వాత.. సరైన జట్టుతో తలపడలేదని ఫీల్ అవుతున్న క్రికెట్ లవర్స్​కు ఈ టోర్నీ మజాను పంచనుంది. ఎందుకంటే ఇందులో దాయాది దేశం పాకిస్థాన్​లో టీమిండియా మ్యాచులు ఆడనుండటంతో ఈ టోర్నీ క్రికెట్ ప్రియుల్లో మరింత జోష్ నిండనుంది. భారత్ x పాకిస్థాన్(India vs Pakistan) మ్యాచ్​లకు ప్రపంచవ్యాప్తంగా పుల్ క్రేజ్ ఉంటుంది. క్రికెట్ అభిమానులు ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు ఆ టైం రానే వచ్చింది.

IND vs PAK Asia Cup 2023 : ఆసియా కప్​లై సమరానికి రెండు జట్లూ సై అంటున్నాయి. ఈ దాయాది దేశాలు మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆసియా కప్ 2023(Asia Cup 2023) లో భాగంగా ఇండియా, పాక్ మ్యాచ్ శనివారం(సెప్టెంబరు 2న) జరగనుంది. ఇప్పటికే ఆరంగ్రేట మ్యాచ్ ఆడేసిన పాకిస్థాన్.. పసికూన నేపాల్​పై 238 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి.. పుల్ జోష్ మీద ఉంది. ఇటు టీమిండియా అభిమానులు వన్డేలలో అగ్రస్థానంలో ఉన్న పాక్​ను మట్టికరిపించి.. ఆసియా కప్​లో బోణీ కొట్టాలని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటి వరకు ఇరు జట్లు 17 సార్లు తలపడగా.. అందులో భారత్ 9 సార్లు, పాక్ 6 సార్లు విజయం సాధించాయి. రెండు మ్యాచ్​లు ఫలితం లేకుండా ముగిశాయి. అయితే.. ఈసారి విజయం ఏ జట్టు తలుపు తడుతుందో చూడాలనే ఉత్కంఠ అందరిలో నిండి ఉంది.

Watch India vs Pakistan Asia Cup Match Live on Phone : ఆసియా కప్​లో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో(Pallekele Stadium in Srilanka) శనివారం జరిగే మ్యాచ్​లో భారత్, పాకిస్థాన్ పోటీ పడనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు టికెట్లు బుక్ చేసుకున్న ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తుంటే.. పరోక్షంగా వీక్షించే కోట్లాది మంది మరింత ఎగ్జైట్​గా ఉన్నారు. అయితే.. కొందరు అభిమానులు వివిధ పనుల కారణంగా.. టీవీల్లో మ్యాచ్ చూడలేరు. ఇలాంటి వారు మొబైల్​లో ఆసియా కప్ మ్యాచ్​లను చూసే అవకాశం ఉంది.

Ind vs Pak Asia Cup ODI Match Live on Phone : ఇప్పటికే జియో(Jio) దెబ్బకు ఐపీఎల్ మొబైల్ ప్రసారాలు కోల్పోయి కుదేలైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఆ లోటును భర్తీ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే.. ఆసియా కప్, ప్రపంచ కప్ ఉచితంగా ప్రసారం చేస్తామని హాట్ స్టార్ ప్రకటించింది. ఈ లైవ్ మ్యాచ్లు చూడాలంటే ప్రేక్షకులు తమ మొబైల్ నంబర్​తో లాగిన్ అవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. సో.. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఫోన్ నంబర్​తో లాగిన్ అయ్యి భారత్, పాక్ మ్యాచ్​ను వీక్షించండి. క్రికెట్ మజాను ఆస్వాదించండి.

ఆసియా కప్ వేదికలు : పాకిస్థాన్, శ్రీలంక

మొత్తం మ్యాచ్​ ల సంఖ్య : 13

భారత్ vs పాక్ మ్యాచ్ ఎక్కడెక్కడ చూడొచ్చు : టీవీల్లో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్​లో చూడొచ్చు. మొబైల్​లో చూడాలనుకునే వారు డిస్నీ ప్లస్ హాట్​స్టార్ యాప్​లో వీక్షించవచ్చు.

భారత్ vs పాక్ మ్యాచ్ టైమింగ్‌ : ఈ టోర్నీలోని మ్యాచులన్నీ డై అండ్ నైట్ ఫార్మా‌ట్‌లో జరుగుతున్నాయి. కాబట్టి.. ఈ మ్యాచ్ కూడా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది.

India Vs Pakistan Asia Cup : మినీ టోర్నీలో భారత్​ X పాకిస్థాన్​.. ఈ ఇంట్రెస్టింగ్​ విషయాలు తెలుసా?

India Vs Pakistan Highest Individual Scores : భారత్​ Vs పాక్​ మ్యాచ్​లు.. క్రీజులో ఈ ప్లేయర్స్ దుమ్ములేపేశారుగా!

Key Players In Asia Cup 2023 : మినీ టోర్నమెంట్​లో అందరి చూపు వీరివైపే.. అంచనాలను అందుకునేదెవరో?

Last Updated : Sep 2, 2023, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.