ETV Bharat / sports

Ind Vs Pak Asia Cup 2023 : షహీన్, హారిస్ బౌలింగ్ మెరుపులు .. రోహిత్, విరాట్​ క్లీన్​బౌల్డ్​ - రోహిత్ బౌల్డ్

Ind Vs Pak Asia Cup 2023 : ఆసియా కప్ 2023 భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్​లో టాస్ గెలిచిన రోహిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్​కు దిగిన భారత్.. పది ఓవర్లలోపే మూడు కీలక వికెట్లు పారేసుకుంది.

Ind Vs Pak Asia Cup 2023
Ind Vs Pak Asia Cup 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 3:35 PM IST

Updated : Sep 2, 2023, 5:12 PM IST

Ind Vs Pak Asia Cup 2023 : Ind Vs Pak Asia Cup 2023 : మినీ టోర్నీలో హై వోల్టేజ్ ఇండో పాక్​ మ్యాచ్​లో వరుణుడు పలుమార్లు అంతరాయం కలిగిస్తున్నాడు. దీంతో మ్యాచ్ 11.2 ఓవర్ల వద్ద రెండోసారి నిలిచిపోయింది. కాసేపటికి పునః ప్రారంభమైన మ్యాచ్​ కాసేపు నిలకడగానే సాగింది. కానీ అంతలోనే మళ్లీ వికెట్​ రూపంలో బ్రేక్​ పడింది. శుభ్​మన్ గిల్(10)​ను హారిస్​ వెనక్కి పంపాడు. దీంతో భారత్​​.. 14.4 ఓవర్లకు 71-4గా నిలిచింది. ప్రస్తుతం క్రీజులో హార్దిక్​(5), ఇషాన్ కిషన్ (13) ఉన్నారు.

  • మొదట 4.2 ఓవర్ వద్ద ఆగిన మ్యాచ్​.. సుమారు 30 నిమిషాల తర్వాత ప్రారంభమైంది. అదే ఓవర్లో అద్భుతమైన బంతితో షహీన్.. కెప్టెన్ రోహిత్ శర్మ (11)ను క్లీన్​బౌల్డ్ చేశాడు.
  • ఇక వన్​ డౌన్​లో వచ్చిన విరాట్ కోహ్లీ ఎదుర్కొన్న మూడో బంతినే బౌండరీకి తరలించాడు. కానీ 6.3 ఓవర్ వద్ద విరాట్​ (4)ను.. షహీన్ వెనక్కిపంపాడు. దీంతో భారత్ 27 పరుగులకే కీలకమైన రోహిత్ , విరాట్​ను కోల్పోయి కష్టాల్లో పడింది.
  • సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్.. గిల్​తో జతకట్టాడు. అయ్యర్.. రెండు ఫోర్లు బాది టచ్​లోకి వచ్చినట్టే కనిపించాడు. కానీ హారిస్ రౌఫ్ బౌలింగ్​లో.. అయ్యర్ (14)క్యాచ్​ ఔటయ్యాడు.

దెబ్బకొట్టన షహీన్..
ముందునుంచి అనుకున్నట్లుగానే పాకిస్థాన్ పేస్ సంచలనం షహీన్ అఫ్రిదీ.. భారత్​ను దెబ్బకొట్టాడు. ఆరంభం నుంచే నిప్పులు చెరుగుతూ.. టీమ్ఇండియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. 5 ఓవర్లో రోహిత్ ఆడుతున్న విధానాన్ని షహీన్ పసిగట్టాడు. ఆ ఓవర్లో రెండు ఔట్​ స్వింగ్​ బంతులేసి, తర్వాత అద్భుతమైన ఇన్​ స్వింగర్​తో రోహిత్​ను క్లీన్​బౌల్డ్ చేశాడు. ఇక వన్​డౌన్​లో వచ్చిన విరాట్​ను ఇన్నింగ్స్​ ఏడో ఓవర్​లో ఔట్​ చేసి టీమ్ఇండియా ఫ్యాన్స్​కు షాకిచ్చాడు.

భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్​మన్‌ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్) , విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

పాకిస్థాన్​ జట్టు..
ఫఖర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌ కీపర్‌), ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్​ (కెప్టెన్), సల్మాన్ అలీ ఆఘా, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహిన్ అఫ్రిది, నసీం షా, హ్యారిస్‌ రవూఫ్.

Last Updated : Sep 2, 2023, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.