Ind Vs Pak Asia Cup 2023 : ప్రతిష్టాత్మక ఆసియా కప్‌కు బుధవారం తెరలేవనుంది. పాకిస్థాన్‌లోని ముల్తన్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ తొలి పోరు కోసం పాక్- నేపాల్ జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే రెండు జట్లు పాకిస్థాన్‌కు పయనమవ్వగా.. మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
అయితే ఆసియా కప్‌లో ఆరు జట్లు పోటీ పడనుండగా.. అందరి దృష్టి మాత్రం ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌లపైనే ఉంది. సాధారణంగా ఈ రెండు జట్ల మధ్య ఏడాదికి ఒక్క మ్యాచ్ జరిగితేనే ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అలాంటిది ఇప్పుడు రెండు వారాల్లో మూడు సార్లు ఇండో–పాక్ వార్ క్రికెట్ లవర్స్‌ను అలరించనుంది. ఈ క్రమంలో తొలి పొరు సెప్టెంబర్ 2న ఆరంభం కానుంది. శ్రీలంకలోని పల్లెకలె వేదికగా జరగనున్న ఈ ఉత్కంఠ మ్యాచ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
అయితే అంతా రెడీగా ఉందన్న తరుణంలో ఒక్క విషయం అభిమానులను ఆందోళను కలిగిస్తోంది. అదే శ్రీ లంక వాతావరణం. తాజా నివేదికల ప్రకారం క్యాండీలో పిడుగులతో కూడిన వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణలు చెబుతున్నారు. 90 శాతం వరకు వర్షం పడేలా ఉందట. దీంతో ఈ మ్యాచ్ సెప్టెంబర్ 2 జరిగే అవాకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయని విశ్లేషకుల అభిప్రాయం.
Asia Cup Records : ఆసియాకప్‌నకు వేళైంది.. ఈ 10 ఇంట్రెస్టింగ్ పాయింట్స్, రికార్డ్స్ తెలుసా?
Asia Cup 2023 : ఆసియా కప్‌నకు రంగం సిద్ధం.. ఈ టోర్నీలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్స్ వీరే!