ETV Bharat / sports

Ind vs Nz Test: కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు!

Ind vs Nz Test 2021: రెండో టెస్టులో డకౌట్​ కావటం వల్ల​ టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. స్వదేశంలో ఆడిన టెస్టు మ్యాచుల్లో 6 సార్లు డకౌటైన మొదటి భారత కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు.

Ind vs Nz Test news
కోహ్లీ
author img

By

Published : Dec 4, 2021, 5:37 AM IST

virat kohli ducks in test: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. ముంబయి వేదికగా న్యూజిలాండ్, భారత్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ (0) ఖాతా తెరవకుండానే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ చేరాడు. దీంతో స్వదేశంలో ఆడిన టెస్టు మ్యాచుల్లో 6 సార్లు డకౌటైన మొదటి భారత కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. కోహ్లీ తర్వాత మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ కెప్టెన్‌గా ఐదు సార్లు ఔటై రెండో స్థానంలో ఉన్నాడు. మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్‌, మహేంద్ర సింగ్‌ ధోని.. మూడు సార్లు టెస్టుల్లో డకౌటయ్యారు. మొత్తంగా దిగ్గజ బ్యాటర్లలో ఒకడైన కోహ్లీ.. తన టెస్టు కెరీర్లో ఇప్పటి వరకు 10 సార్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరాడు.

అంపైర్‌ నిర్ణయంపై కోహ్లీ అసహనం..

వాంఖడే స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో విరాట్‌ కోహ్లీ (0) అనూహ్య రీతిలో ఔటయ్యాడు. తనను ఎల్బీడబ్ల్యూగా ప్రకటించిన అంపైర్‌ నిర్ణయంపై కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. క్రీజు వీడుతున్న సమయంలో ఫీల్డ్‌ అంపైర్‌ నితిన్‌ మేనన్‌తో ఏదో మాట్లాడాడు. ఇంతకు కోహ్లీ ఎలా ఔటయ్యాడంటే.. అజాజ్ పటేల్ వేసిన 30వ ఓవర్ చివరి బంతి.. నేరుగా కోహ్లీ ప్యాడ్లను తాకినట్లుగా భావించి అప్పీల్ చేశాడు. అంపైర్‌ కూడా ఔటిచ్చేశాడు. దీంతో కోహ్లీ రివ్యూ కోరాడు. ఆ సమయంలో బ్యాట్‌, ప్యాడ్‌ మధ్య బంతి ఉండటం వల్ల.. మొదట బ్యాటును తాకిందా.? ప్యాడ్‌ను తాకిందా.? అనే విషయం తెలియలేదు. థర్డ్ అంపైర్ వీరేందర్ శర్మ వివిధ కోణాల్లో పరిశీలించినా స్పష్టత రాలేదు. దీంతో రెండింటికీ ఒకేసారి తాకినట్లుగా భావించి ఔటిచ్చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ నిరాశతో క్రీజు వీడాల్సి వచ్చింది. ఇటీవలే న్యూజిలాండ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌కు, కాన్పుర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టుకు కోహ్లీ దూరంగా ఉన్నాడు. ముంబయి వేదికగా జరుగుతున్న రెండో టెస్టుకు కోహ్లీ అందుబాటులోకి వచ్చాడు.

ఇదీ చదవండి:తొలి రోజు ఆట అదుర్స్​.. శతకంతో కదం తొక్కిన మయాంక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.