కొంత మంది క్రికెటర్లు చరిత్రలో నిలిచిపోతుంటారు. వారిపై అభిమానులు చూపే అంతా ఇంతా ఉండదు. అలాంటి వారిలో ఒకరే ధోనీ. ఇండియన్ క్రికెట్ టీమ్‌లో ఎంతో ప్రేక్షకాభిమానాన్ని సంపాదించిన వారిలో ఎమ్.ఎస్ ధోనీ ఒకరు. ఆయన స్టేడియంలోకి రాగానే అక్కడి ప్రాంతమంతా ధోనీ.. ధోనీ అనే పేరుతో హోరెత్తి పోతుంటుంది. సేమ్ అలాగే శుక్రవారం జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇదే జరిగింది. మ్యాచ్‌ను చూడటానికి వచ్చిన మహీని చూడగానే అభిమానుంలందరూ సంతోషంతో ఉప్పొంగి పోయారు.
ఇదీ జరిగింది.. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి మూడేళ్లు అవుతున్నా అభిమానులు మాత్రం అతనిపై ఉన్న అభిమానం కొంచెం కూడా తగ్గలేదు. తాజాగా తమ స్వస్థలం రాంచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20కు అతడు ఫ్యామిలీతో హాజరయ్యాడు. స్టాండ్స్‌లో కూర్చొని మ్యాచ్ చూస్తూ సందడి చేశాడు.
అంతకముందు ఒకరోజే టీమ్ఇండియా ఆటగాళ్లను కలిసిన సర్‌ప్రైజ్ చేసిన మహీ.. మ్యాచ్ సందర్భంగా స్డేడియంలో కూడా కనపడగానే.. అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మహీ పేరు స్క్రీన్‌పై కనబడగానే స్టేడియం మొత్తం ధోనీ.. ధోనీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఫ్యాన్స్ కేకలు వేస్తుంటే... మహీ కూడా ఎంతో ఆనందంతో అభివాదం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
ఇకపోతే తొలి టీ20లో న్యూజిలాండ్‌పై 21 పరుగుల తేడాతో భారత జట్టు ఓటమిపాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేసింది. సూర్యకుమార్ యాదవ్(47), వాషింగ్టన్ సుందర్(50) పరుగులతో రాణించినా ఫలితం లేకపోయింది. హార్దిక్ పాండ్య(21), దీపక్ హుడా(10) ఫర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా పేలవ ప్రదర్శన చేశారు. కివీస్ బౌలర్లలో బ్రేస్‌వెల్(2), సాంటర్న్(2) వికెట్లు తీశారు. డుఫ్ఫీ(1), సోధి(1), ఫెర్గుసన్(1) చెరొ వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. మిచెల్(59), కన్వే(52), ఆలెన్(35) రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో సుందర్ (2) వికెట్లు తీయగా.. అర్షదీప్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.
-
MSD + Ranchi = 🤩
— BCCI (@BCCI) January 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
When the Ranchi crowd welcomed the legendary @msdhoni in style 😃👌#TeamIndia | #INDvNZ | @mastercardindia pic.twitter.com/40FoEDudSv
">MSD + Ranchi = 🤩
— BCCI (@BCCI) January 27, 2023
When the Ranchi crowd welcomed the legendary @msdhoni in style 😃👌#TeamIndia | #INDvNZ | @mastercardindia pic.twitter.com/40FoEDudSvMSD + Ranchi = 🤩
— BCCI (@BCCI) January 27, 2023
When the Ranchi crowd welcomed the legendary @msdhoni in style 😃👌#TeamIndia | #INDvNZ | @mastercardindia pic.twitter.com/40FoEDudSv
ఇదీ చూడండి: 'వీడ్కోలు పలికినా ఆటకు దూరంగా ఉండలేను.. కొత్త పాత్రలో తిరిగొస్తా'