IND vs NZ 2nd Test: టీమ్‌ఇండియా ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్‌కు గాయాలయ్యాయి. ఈ కారణంగానే భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేసేందుకు మైదానంలో అడుగుపెట్టలేదు ఈ ఇద్దరు క్రికెటర్లు.
"రెండో ఇన్నింగ్స్ ఆడుతుండగా టీమ్‌ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మోచేయికి బంతి తగిలింది. ఈ కారణంగా అతడు ఫీల్డింగ్ చేయకూడదని వైద్యులు సూచించారు. శుభ్‌మన్ గిల్ చేతివేలికి గాయమైన కారణంగా ఫీల్డింగ్ చేసేందుకు రాలేదు" అని బీసీసీఐ మీడియా బృందం స్పష్టం చేసింది.
రెండో టెస్టులో మయాంక్ అగర్వాల్ 150, 62 పరుగులతో అదరగొట్టాడు. గిల్ రెండు ఇన్నింగ్స్‌లలో 44, 47 పరుగులు చేశాడు. అయితే.. వీరి స్థానంలో సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్ ఫీల్డింగ్ చేశారు.
భారీ లక్ష్యం..
540 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ మూడో రోజు ఆట ముగిసేసమయానికి ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. క్రీజులో హెన్రీ నికోల్స్ (36), రచిన్ రవీంద్ర (2) ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్(3), అక్షర్ పటేల్(1) వికెట్లు తీశారు.
చివరి రెండు రోజుల్లో కివీస్ గెలవాలంటే 400 పరుగులు చేయాల్సి ఉండగా.. ఐదు వికెట్లు తీస్తే విజయంతోపాటు సిరీస్ టీమ్‌ఇండియా సొంతమవుతుంది.
ఇదీ చదవండి:
కెమెరా వల్ల ఆగిన మ్యాచ్.. కోహ్లీ ఫన్నీ రియాక్షన్
IND Vs NZ 2nd Test: కష్టాల్లో కివీస్.. 400 పరుగుల భారీ టార్గెట్