ETV Bharat / sports

IND vs ENG World Cup 2023 : ఇంగ్లాండ్​తో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయ్.. దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందే - వరల్డ్​కప్ 2023 భారత్ పాయింట్లు

IND vs ENG World Cup 2023 : 2023 ప్రపంచకప్​లో భాగంగా అక్టోబర్ 29న భారత్ - ఇంగ్లాండ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఇంగ్లాండ్ ఈ మ్యాచ్​లోనైనా గెలిచి టోర్నీలో నిలవాలని ఆశిస్తోంది. మరోవైపు భారత్.. మరో విజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో టాప్​లోకి వెళ్లాలని ప్రయత్నిస్తోంది.

IND vs ENG World Cup 2023
IND vs ENG World Cup 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2023, 9:32 PM IST

IND vs ENG World Cup 2023 : 2023 వరల్డ్​కప్​లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 29) భారత్.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్​తో తలపడనుంది. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్​కు లఖ్​నవూ స్టేడియం వేదిక కానుంది. అయితే ప్రస్తుత మెగాటోర్నీలో ఓటమి అనేదే లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతోంది టీమ్ఇండియా. మరోవైపు ఇంగ్లాండ్.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదా నిలబెట్టుకోవడం అటుంచితే, కనీసం సెమీస్​కు వచ్చే ఛాన్స్​లు కూడా దూరం చేసుకుంటోంది. ఆదివారం నాటి మ్యాచ్​​లో విజయం సాధించి.. సెమీస్​కు మరింత చేరువ కావాలని భారత్ ఉవ్విళ్లూరుతుంటే.. హ్యాట్రిక్ ఓటముల తర్వాత అయినా గెలుపు బాట పట్టాలని ఇంగ్లాండ్ ఆశిస్తోంది.

టీమ్ఇండియా ఎలా ఉందంటే?
కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ ప్రస్తుతం అత్యంత పటిష్ఠంగా ఉంది. శుభ్​మన్ గిల్, రోహిత్, విరాట్ కోహ్లీతో టాప్​ఆర్డర్ బలంగా ఉంటే.. శ్రేయస్ అయ్యర్, రాహుల్​తో మిడిలార్డర్ దృఢంగా ఉంది. ఇప్పటివరకూ ఆడిన ప్రతి మ్యాచ్​లో ఈ ఐదుగురే జట్టును దాదాపు విజయతీరాలకు చేర్చారు. తొలి మ్యాచ్ మినహా.. భారత్​కు రోహిత్, గిల్ అన్ని మ్యాచ్​ల్లో శుభారంభాలు ఇచ్చారు.

ఇక హార్దిక్ గైర్హాజరీలో గత మ్యాచ్​లో జట్టులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. దీంతో అతడికి మేనేజ్​మెంట్ మరో ఛాన్స్ ఇవ్వవచ్చు. ఆల్​రౌండర్ జడేజా, సూర్యతో నెంబర్ 6,7 స్థానాల్లో కూడా భారత్ బ్యాటింగ్ ఆర్డర్ డీప్​గా ఉంది. ఇక మెయిన్ బౌలర్లుగా కుల్​దీప్, బుమ్రా జట్టులో ప్లేస్ ఖాయం చేసుకోగా.. మరో రెండు స్థానాల కోసం షమీ, సిరాజ్, శార్దూల్ మధ్య పోటీ ఉంది.

అశ్విన్​కు లైన్ క్లియర్!.. లఖ్​నవూ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం. దీంతో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. శార్దూల్ స్థానంలో అశ్విన్​ తీసుకొని.. జడేజా, కుల్​దీప్, అశ్విన్​ ముగ్గురు స్పిన్నర్​లతో బరిలోకి దిదే అవకాశం ఉంది.

  • KL Rahul is back to a ground that has given him life lessons & bittersweet memories 🏟️

    On Sunday, he wants to make memories that he'll remember only for the good 👌👌

    Muskuraiye, KL Rahul Lucknow mein hai 🤗

    WATCH 🎥🔽 - By @28anand #TeamIndia | #CWC23 | #INDvENG

    — BCCI (@BCCI) October 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పడుతూనే ఇంగ్లాండ్ ప్రయాణం..
ప్రస్తుత టోర్నీలో ఇంగ్లాండ్.. ఆశించిన స్థాయిలో ప్రదర్శన చూపడం లేదు. ఓటమితోనే టోర్నీని ఆరంభించిన ఇంగ్లాండ్.. రెండో మ్యాచ్​లో బంగ్లాదేశ్​పై నెగ్గి గాడిలో పడ్డట్టు కనిపించింది. కానీ, ఆ తర్వాత హ్యాట్రిక్ ఓటములు మూటగట్టుకుంది. అందులో పసికూన అఫ్గానిస్థాన్ చేతిలో ఓటమిని ఇంగ్లీష్ జట్టు ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేపోతున్నారు. తర్వాత వరుసగా సౌతాఫ్రికా, శ్రీలంకతోనూ చిత్తుగా ఓడి.. పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో ప్లేస్​లో ఉంది. అయితే బెయిర్ స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, బట్లర్​తో కూడిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్​ను తక్కువ అంచనా వేయలేం. కానీ, భీకర ఫామ్​లో ఉన్న భారత బౌలర్లు.. వీరి దూకుడుకు కళ్లెం వేసే అవకాశం లేకపోలేదు.

ప్రతీకారానికి వేళాయే!
అక్టోబర్ 29 నాటి మ్యాచ్​తో ఇంగ్లాండ్​పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్​కు మంచి ఛాన్స్ ఉంది. గతేడాది టీ20 వరల్డ్​కప్​లో సెమీస్​లో ఇంగ్లాండ్.. భారత్​ను 10 వికెట్ల తేడాతో ఓడించి ఇంటిబాట పట్టించింది. అయితే ప్రస్తుత ప్రపంచకప్​లో ఐదు మ్యాచ్​లు ఆడి కేవలం ఒక మ్యాచ్​లోనే నెగ్గిన ఇంగ్లాండ్​కు ఆదివారం మ్యాచ్ అత్యంత కీలకం. ఈ మ్యాచ్​లో గెలిస్తేనే ఇంగ్లాండ్ సెమీస్ రేస్​లో ఉంటుంది. ఒకవేళ ఓడితే.. అనధికారంగా డిఫెండింగ్ ఛాంప్ టోర్నీ నుంచి నిష్ర్కమిస్తుంది. అందుకే ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా ఎలాగైనా.. గెలిచి ఇంగ్లాండ్​ను దెబ్బకు దెబ్బ కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

2023 World Cup Records : మెగాటోర్నీ మొనగాళ్లు వీరే​.. రోహిత్, డికాక్, విరాట్ ఇంకా ఎవరంటే?

ENG vs SL World Cup 2023 : ఇంగ్లాండ్​కు మరో షాక్​..శ్రీలంక చేతిలో ఓటమి.. సెమీస్​ నుంచి ఔట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.