ETV Bharat / sports

జడ్డూ ఈజ్​ బ్యాక్​.. అతడు జట్టును ఆదుకున్న మ్యాచ్​లివే!

author img

By

Published : Jul 3, 2022, 1:37 PM IST

IND VS ENG Ravindra Jadeja: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు బ్యాట్‌తో ఇటు బంతితో జట్టుకు కీలకమైన ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. తాజాగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న ఐదో మ్యాచ్​లో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. ఈ సందర్భంగా అతడు గతంలో భారీ ఇన్నింగ్స్​ ఆడి టీమ్​ను ఆదుకున్న సందర్భాలను తెలుసుకుందాం.

ravindra jadeja
రవీంద్ర జడేజా

IND VS ENG Ravindra Jadeja: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్టు మ్యాచ్‌లో జడ్డూ(104).. అద్భుత ఇన్నింగ్స్​ ఆడాడు. సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన అతడు.. పంత్​తో(146) కలిసి 222 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. దీంతో భారత్‌ 416 పరుగులు చేయగలిగింది. అయితే జడ్డూ ఇలాంటి ప్రదర్శన చేయడం కొత్తేమీ కాదు. అయితే ఈ మ్యాచ్​కు ముందు అతడు గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నాడు. ఈసారి టీ20 లీగ్‌లో టోర్నీ ప్రారంభానికి ముందే చెన్నై కెప్టెన్‌గా ఎంపికైన అతడు ఆ జట్టును నడిపించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. సారథిగానే కాకుండా బ్యాటర్​గానూ తేలిపోయాడు. కానీ మళ్లీ ఈ మ్యాచ్​తో తిరిగి ఫామ్​లోకి వచ్చాడు. తానేంటో నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడు గతంలో టీమ్​ను ఆదుకున్న సందర్భాలను నెమరువేసుకుందాం...

జడేజా ఆదుకున్న మ్యాచ్‌లు..

  • గతేడాది ఇంగ్లాండ్‌ పర్యటనలో ఇదే సిరీస్‌లోని తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా జడేజా (56; 86 బంతుల్లో 8x4, 1x6) అర్ధ శతకంతో రాణించాడు. దీంతో జట్టు 95 పరుగుల ఆధిక్యం సంపాదించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, చివరికి ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.
  • ఈ ఏడాది టీ20 లీగ్‌కు ముందు మొహాలి వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఏకంగా 175 పరుగులు చేశాడు. ఇది అతడి కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌. దాంతో టీమ్‌ఇండియా 574/8 (డిక్లేర్డ్‌) భారీ స్కోర్‌ చేసింది. ఆపై బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి 9 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ 222 పరుగుల తేడాతో విజయం సాధించింది.
  • 2020లో మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో జడేజా తొలి ఇన్నింగ్స్‌లో 57 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 3 వికెట్లు తీశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 8 వికెట్ల తేడాతో గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు.
  • 2019లో సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ జడేజా 81 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 622/7 (డిక్లేర్డ్‌ ) భారీ స్కోర్‌ చేసింది. అనంతరం ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులు చేయగా జడేజా నాలుగు వికెట్లు తీశాడు. అయితే, ఆ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.
  • 2018లో ఓవల్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ జడేజా 86 (నాటౌట్‌) పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అలాగే బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో మొత్తం కలిపి 7 వికెట్లు తీశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓటమిపాలైంది.
  • 2017లో శ్రీలంక పర్యటనలో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిదో నంబర్‌ ఆటగాడిగా వచ్చిన జడేజా 70 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మరోసారి 7 వికెట్లు సాధించాడు. దీంతో టీమ్ఇండియా ఇన్నింగ్స్‌ 52 పరుగుల తేడాతో విజయం సాధించడంలో తనవంతు మెరిశాడు.
  • 2017లోనే ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 63 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో గెలిచింది.
  • 2015లో మొహాలి వేదికగా దక్షిణాఫ్రికాతో ఆడిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులే చేసింది. అందులో జడేజా (38) రెండో టాప్‌ స్కోరర్‌. అనంతరం ఆ జట్టు 184 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన జడ్డూ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీశాడు. దీంతో టీమ్‌ఇండియా విజయంలో మరోసారి కీలకంగా ఆడాడు.

ఇదీ చూడండి: అండర్సన్​​పై జడ్డూ కామెంట్స్​ వైరల్​.. వీరిద్దరి మధ్య గొడవ ఏంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.