ETV Bharat / sports

IND vs ENG: కోహ్లీ, రూట్​.. ఈ రికార్డులు అందుకుంటారా? - Joe Root

లీడ్స్​ వేదికగా మరికాసేపట్లో ఇంగ్లాండ్- ఇండియా మధ్య మూడో టెస్టు ప్రారంభమవ్వనుంది. జయాపజయాల గురించి పక్కన పెడితే ఈ మ్యాచ్​లో పలు రికార్డులు బద్దలు కొట్టేందుకు ఇరుజట్ల క్రికెటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఏయే ఆటగాడు ఏ ఫీట్​కు దగ్గర్లో ఉన్నాడనేది తెలుసుకుందామా..

India vs England
ఇండియా vs ఇంగ్లాండ్
author img

By

Published : Aug 25, 2021, 2:32 PM IST

లీడ్స్​ హెడ్డింగ్లీ వేదికగా మరికాసేపట్లో ఇంగ్లాండ్​- ఇండియా మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్​ల సిరీస్​లో 1-0తో టీమ్ఇండియా ఆధిక్యంలో ఉంది. అదే ఊపుతో తాజా మ్యాచ్​లోనూ విజయాన్ని అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. లార్డ్స్​ టెస్టుకు ప్రతీకారం తీర్చుకోవాలని రూట్​ సేన భావిస్తోంది. ఈ మ్యాచ్​లో గెలిచి సిరీస్​ను సమం చేయాలని ఇంగ్లాండ్​ భావిస్తోంది. అయితే అంతకంటే ముందు ఈ టెస్టు ద్వారా ఇరుజట్ల ఆటగాళ్లకు పలు రికార్డులు చేరుకునే అవకాశం ఉంది. అవేంటో ఓ సారి చూద్దాం.

విరాట్​ కోహ్లీ..

India vs England
విరాట్ కోహ్లీ

రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ.. అన్ని ఫార్మాట్లలో కలిపి 23 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచేందుకు మరో 63 పరుగుల దూరంలో ఉన్నాడు. మూడు ఫార్మాట్లలో 487 ఇన్నింగ్స్​ల్లో ప్రస్తుతం 22,937 పరుగులు సాధించాడు టీమ్ఇండియా రన్​ మిషన్​. 500లోపు ఇన్నింగ్స్​ల్లో ఈ ఫీట్​ చేరుకోవడానికి కోహ్లీకి పెద్ద కష్టమేమీ కాదు. ఇంగ్లాండ్​ గడ్డపై ఇంకా మూడు టెస్టులు ఉన్న నేపథ్యంలో అతడు ఒక్క ఇన్నింగ్స్​లో కుదురుకున్న ఆ మాత్రం స్కోరు సులువుగా చేయగలడు.

ఇక టెస్టుల్లో విరాట్ 2019 నవంబర్​లో చివరిసారిగా సెంచరీ మార్క్​ను అందుకున్నాడు. ఆ తర్వాత మూడంకెల స్కోరు అందుకోవడానికి కోహ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తాజా టెస్టులో మన చీకూ ఈ శతకాల కొరత అధిగమిస్తాడని ఆశిద్దాం.

రోహిత్ శర్మ..

India vs England
రోహిత్ శర్మ

ఇటీవల కాలంలో టెస్టుల్లో స్థిరంగా రాణిస్తున్నాడు భారత ఓపెనర్​ రోహిత్ శర్మ. ఈ ఫార్మాట్లో అతడు మరో 169 పరుగులు సాధిస్తే టెస్టుల్లో 3వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. మరో 130 రన్స్​ చేస్తే కనుక అన్ని ఫార్మాట్లలో కలిపి 15వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్​మన్​గా నిలుస్తాడు.

ఇషాంత్​ శర్మ..

India vs England
ఇషాంత్ శర్మ

టీమ్​ఇండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ సరికొత్త రికార్డుకు చేరువలో ఉన్నాడు. టెస్టుల్లో జహీర్​ ఫీట్​ను అధిగమించడానికి అతడికి మరో వికెట్​ చాలు. సుదీర్ఘ ఫార్మాట్లో జహీర్.. 311 వికెట్లు తీసుకున్నాడు. జంబూ కూడా అన్నే వికెట్లతో అతడి సరసన ఉన్నాడు.

సామ్ కరన్..

India vs England
సామ్ కరన్

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో సామ్ కరన్​ను ఓ రికార్డును ఊరిస్తోంది. టెస్టుల్లో 50 వికెట్ల క్లబ్​లో చేరాలంటే అతడికి మరో 5 వికెట్లు అవసరం.

జో రూట్​..

India vs England
జో రూట్

ఇంగ్లాండ్​ కెప్టెన్​ జో రూట్​ ముందు కూడా ఓ రికార్డు ఊరిస్తోంది. అతడి సారథ్యంలో మరో టెస్టు మ్యాచ్​ గెలిస్తే అత్యధిక టెస్టు విజయాలు అందుకున్న నాయకుడిగా నిలుస్తాడు. ఇప్పటికే 26 విజయాలతో మైకేల్ వాన్​తో సమానంగా ఉన్నాడు.

ఇదీ చదవండి: Virat Kohli: 'అది ప్రత్యర్థి బలాన్ని బట్టి ఉంటుందా?.. ఇదేం ప్రశ్న'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.