ETV Bharat / sports

సెంచరీ దిశగా జో రూట్​.. టీ విరామానికి ఇంగ్లాండ్​ 235/5

నాటింగ్​హామ్​ టెస్టు నాలుగో రోజు టీ విరామానికి ఇంగ్లాండ్​ 5 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. టీమ్ఇండియా బౌలర్లలో బుమ్రా, సిరాజ్​ తలో రెండు వికెట్లు తీశారు. ప్రస్తుతం రూట్ ​(96*), బట్లర్ (15*) క్రీజులో ఉన్నారు.

d
d
author img

By

Published : Aug 7, 2021, 8:39 PM IST

Updated : Aug 7, 2021, 8:50 PM IST

భారత్​తో తొలి టెస్టు నాలుగో రోజు టీ విరామ సమయానికి ఇంగ్లాండ్ 5 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. దీంతో 140 పరుగుల ఆధిక్యంలో ఉంది రూట్ సేన. టీమ్ఇండియా బౌలర్లలో బుమ్రా, సిరాజ్​ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ప్రస్తుతం రూట్​ (96*), బట్లర్​ (15*) క్రీజులో ఉన్నారు.

119/2తో భోజన విరామానికి వెళ్లిన ఇంగ్లాండ్​.. రెండో సెషన్​లో మూడు వికెట్లను కోల్పోయింది. రూట్​- సిబ్లీ జోడీ మూడో వికెట్​కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని 135 పరుగుల వద్ద బుమ్రా విడదీశాడు. ఓ చక్కటి బంతితో సిబ్లీని పెవిలియన్​ పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బెయిర్​ స్టో ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. కేవలం 50 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. ఇతన్ని సిరాజ్​ ఔట్​ చేశాడు. తర్వాత బ్యాటింగ్​కు దిగిన లారెన్స్​ను ఠాకుర్​ వెనక్కి పంపాడు.

Last Updated : Aug 7, 2021, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.