WTC Final 2023 Teamindia vs Australia : డబ్ల్యూటీసీ ఫైనల్ 2023కి రంగం సిద్ధమైంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ జట్టు ఇప్పటికే ఇంగ్లాండ్‌కు చేరుకుని ప్రాక్టీస్ చేస్తోంది. దీంతో గత పదేళ్లుగా భారత క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న కలల ఐసీసీ ట్రోఫీని.. రోహిత్ శర్మ సేన అందుకుంటుందా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
2013లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో టీమ్ఇండియా.. ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో చివరి ఐసీసీ టైటిల్‌ను ముద్దాడింది. అయితే ఆ తర్వాత పలు సార్లు ఐసీసీ టైటిల్ గెలవడానికి దగ్గరి వరకు వెళ్లినా అది కుదరలేదు. టీమ్ఇండియా ట్రోఫీలను దక్కించుకోలేకపోయింది. అయితే ఈసారి రోహిత్ శర్మ ఆ కరువును తీర్చాలని అభిమానులు ఆశిస్తున్నారు.
10 ఏళ్లలో 8 సార్లు..
Team india icc trophies : ప్రతి ఐసీసీ టోర్నమెంట్లో టీమ్ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. కానీ 2013 తర్వాత కీలక సందర్భాల్లో విఫలమవుతూ వస్తోంది. 2014 టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్ఇండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ శ్రీలంక చేతిలో ఓటమిని అందుకుంది. ఆ తర్వాత 2015 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది భారత్. అక్కడ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని మూటగట్టుకుంది.
2016లో మరోసారి టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నా.. వెస్టిండీస్ విలన్‌గా మారి.. భారత్ ఖాతాలో మరో ఓటమి పడేలా చేసింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో ఇంకో ఓటమి దక్కింది. ఇక 2019 వన్డే ప్రపంచకప్‌లో మంచి ప్రదర్శన చేసి సెమీఫైనల్‌కు చేరుకుంది. కానీ అక్కడ న్యూజిలాండ్.. భారత్‌ను ఓడించింది.
అయితే 2021లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో.. టీమ్ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తొలి ఎడిషన్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ, అక్కడ కూడా భారత్‌కు కివీస్ షాక్ ఇచ్చింది. టైటిల్‌ను దక్కనివ్వకుండా ఓడించి టైటిల్ కలను విచ్ఛినం చేసింది. ఇక 2022లో రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 ప్రపంచ కప్ 2022 సెమీ ఫైనల్‌కు చేరుకుంది టీమ్ఇండియా. అయితే ఇంగ్లాండ్ జట్టు.. భారత జట్టును 10 వికెట్ల తేడాతో ఓడించి ఏకపక్షంగా మ్యాచ్‌ను ఖాతాలో వేసుకుంది.
ఇక తాజాగా 2021-23 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(WTC Final 2023) రూపంలో.. రోహిత్ సేనకు మరో అవకాశం దక్కింది. మరి ఈ తుది పోరులో టీమ్ఇండియా రోహిత్ శర్మ కెప్టెన్సీలో ట్రోఫీని ముద్దాడుతుందో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది. గత పదేళ్ల ఐసీసీ టైటిళ్ల కరువు తీరుతుందా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంగ్లాండ్ ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో ఈ పోరు జరగనుంది. ఈ నెల జూన్ 7 నుంచి జూన్ 11 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. రిజర్వ్ డే కూడా ఉంది.
ఇదీ చూడండి :