Ind vs Aus World Cup 2023 : 2023 ప్రపంచకప్‌లో అసలు సిసలైన పోరు పోరుకు సమయం ఆసన్నమైంది. చెన్నై చెపాక్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ముందుగా అనుకున్నట్లుగానే టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులో స్థానంలో సంపాదించాడు.
తుది జట్లు..
భారత్.. రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్, జడేజా, అశ్విన్, సిరాజ్
అస్ట్రేలియా.. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, లబుషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మ్యాక్స్‌వెల్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, హజెల్‌వుడ్, ఆడమ్ జంపా,
-
The wait is over and Match Day is here! 🔝#TeamIndia take on Australia in their opening game of #CWC23 🏟️
— BCCI (@BCCI) October 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
📍 Chennai
⏰ 2 PM IST
💻 https://t.co/Z3MPyeL1t7 pic.twitter.com/IhkWN9jVPn
">The wait is over and Match Day is here! 🔝#TeamIndia take on Australia in their opening game of #CWC23 🏟️
— BCCI (@BCCI) October 8, 2023
📍 Chennai
⏰ 2 PM IST
💻 https://t.co/Z3MPyeL1t7 pic.twitter.com/IhkWN9jVPnThe wait is over and Match Day is here! 🔝#TeamIndia take on Australia in their opening game of #CWC23 🏟️
— BCCI (@BCCI) October 8, 2023
📍 Chennai
⏰ 2 PM IST
💻 https://t.co/Z3MPyeL1t7 pic.twitter.com/IhkWN9jVPn
మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. సహచర ఆటగాళ్లను ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రపంచకప్ లాంటి ప్రతిష్ఠాత్మకమైన టోర్నమెంట్లో.. ఏ ఆటగాడు కూడా వ్యక్తిగత రికార్డుల కోసం ప్రాధాన్యం ఇవ్వకూడని సూచించాడు. మైలురాళ్లు కోసం మెగాటోర్నీ వేదిక కాదని పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తూ.. జట్టులో హార్దిక్ పాండ్య లాంటి ఫాస్ట్ బౌలర్ ఉండగా.. అదనంగా మరో స్పిన్నర్‌ను ఆడించేందుకు వీలుంటుందని రోహిత్ అభిప్రాయపడ్డాడు.
"పాండ్య వంటి నాణ్యమైన పేసర్ ఉండగా.. మాకు ఇంకో స్పిన్నర్‌ను జట్టులో ఎంపిక చేసుకునే ఛాన్స్ ఉంటుంది. పాండ్య కచ్చితత్వంతో నిలకడతో కూడిన వేగంతో బంతులు సంధిచగలడు. దీంతో ముగ్గురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో మా జట్టు బ్యాలెన్స్‌గా ఉంటుంది. కానీ మ్యాచ్‌కు ముందు పిచ్‌ను చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. మేము భారత క్రికెటర్లం. ఒత్తిళ్లను అధిగమించి.. చాలా దృఢంగా ఉంటాం. జట్టులో అందరూ ఇలాంటి పరిస్థితులను దాటుకొని ఇక్కడ దాకా వచ్చారు. నా 16 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఎన్నో విషయాలను నేర్చుకున్నా. ఇలాంటి మెగా టోర్నీల్లో ఒత్తిడి మామూలే. వాటిని ఎదుర్కొనే సత్తా కూడా మాకుంది. ఇక గిల్ కూడా త్వరలోనే కోలుకుని జట్టుతో కలుస్తాడు. కుర్రాడే కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతడి ఫిట్‌నెస్ స్థాయి అద్భుతం" అని రోహిత్ అన్నాడు.
World Cup 2023 Ind vs Aus : చెపాక్‌లో భారత్ తొలిపోరు.. ఆస్ట్రేలియాపై జోరు ప్రదర్శించేనా?