ETV Bharat / sports

'ఏకైక టెస్ట్​లో ఓడినా మనసులు గెలిచేశావ్​గా'- హీలీ చేసిన పనికి ఫ్యాన్స్​ ఫుల్​ ఖుషీ! - అలీసా హీలీ వైరల్ వీడియో

Ind Vs Aus Women Test Healy : ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్​ అలీసా హీలీ క్రీడాస్ఫూర్తి ప్రదర్శించింది. మైదానంలో తన పనితో అందరినీ ఆకట్టుకుంటుంది. అసలేం చేసిందంటే?

Ind Vs Aus Women Test Healy
Ind Vs Aus Women Test Healy
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 25, 2023, 7:03 AM IST

Ind Vs Aus Women Test Healy : ముంబయి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్​లో భారత మహిళల జట్టు దుమ్ముదులిపేసింది. ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్‌ జట్టుపై భారత మహిళా జట్టుకు మొట్టమొదటి టెస్టు గెలుపు ఇదే కావడం విశేషం. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు కెప్టెన్‌ అలీసా హీలీ మాత్రం తన చర్యతో అభిమానుల మనసును గెలుచుకుంది.

ఏం జరిగిందంటే?
ఆసీస్​పై చరిత్రాత్మక విజయం తర్వాత భారత మహిళల జట్టు సంబరాల్లో మునిగిపోయింది. ఆ సమయంలో ట్రోఫీని అందుకున్న భార‌త జ‌ట్టు ఛాంపియ‌న్స్ హోర్డింగ్ వెన‌క ఉండి ఫొటోలకు పోజులు ఇచ్చింది. ఈ క్రమంలో అలీసా హీలీ ఫోటోగ్రాఫర్‌ అవ‌తారం ఎత్తింది. భారత జట్టు విన్నింగ్‌ మూమెంట్స్‌ను కెమెరాలో బంధించింది హీలీ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓడిపోయినప్పటికీ అలీసా హీలీ క్రీడా స్ఫూర్తికి అభిమానులు ఫిదా అయిపోయారు. హీలీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఓడినా మనుసులు గెలిచేసేవంటూ కామెంట్లు పెడుతున్నారు.

మ్యాచ్​ వివరాలు ఇలా
ఇక ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా మొద‌టి ఇన్నింగ్స్‌లో 219 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం టీమ్​ఇండియా త‌న తొలి ఇన్నింగ్స్‌లో 406 పరుగులు సాధించింది. దీంతో భార‌త్ 187 ప‌రుగుల కీల‌క‌మైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది. 74 ప‌రుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 261 ప‌రుగుల‌కు ఆలౌటైన ఆసీస్‌, భారత్‌ ముందు 74 ప‌రుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. 75 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

కోచ్ వల్లే విజయం!
"హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (మూడో రోజు) రెండు వికెట్లు తీయడం మ్యాచ్‌లో మలుపు అని నా ఉద్దేశం. హర్మన్‌ చెప్పినట్లు మా జట్టు మెరుగైన ప్రదర్శన చేయడంలో కోచ్‌ అమోల్‌ మజుందార్‌ పాత్ర ఉంది. అతడు అనుభవజ్ఞుడైన ఆటగాడు. విలువైన సూచనలు చేశాడు. మేం వాటిని పాటించడానికి ప్రయత్నించాం. ఫలితాలను గత రెండు మ్యాచ్‌ల్లో చూడొచ్చు. అతడు మా కోచ్‌గా వచ్చినందుకు సంతోషంగా ఉంది" అని స్నేహ్‌ రాణా తెలిపింది.

ఆసీస్​ కెప్టెన్​ చేసిన పనికి భారత జట్టు​ ఫైర్​ - హర్మన్​కు అంత కోపం వచ్చిందా!

తెలుగు కుర్రాళ్లకు గోల్డెన్ ఛాన్స్- చరణ్ క్రికెట్​ టీమ్​లోకి ఆహ్వానం- రిజిస్టర్ చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.