Ind vs Aus 2nd ODI 2023 : భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగుతున్నరెండో వన్డేలో టీమ్ఇండియా బ్యాటర్లు అదరగొడుతున్నారు. యంగ్ స్టార్ శుభ్‌మన్ గిల్ (104 పరుగులు : 97 బంతులు, 6x4, 4x6), కమ్‌బ్యాక్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ (105 పరుగులు : 90 బంతులు, 11x4, 3x6) శతకాలతో చెలరేగిపోయారు. ఈ క్రమంలో గిల్ తన వన్డే కెరీర్లో ఆరో సెంచరీ నమోదు చేయగా.. అయ్యర్‌కు ఇది మూడవది.
రుతురాజ్ గైక్వాడ్ (8) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అయ్యర్‌తో జతకట్టాడు గిల్. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లలను చీల్చి చెండాడారు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మొదటి నుంచి రన్‌రేట్ 7 కు తగ్గకుండా చూసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకొని స్వేచ్ఛగా క్రీజులో పరుగులు చేశారు. ముఖ్యంగా అయ్యర్.. ఈ ఇన్నింగ్స్‌లో ఫోర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ సెంచరీలు పూర్తి చేశారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో భారత్ తరఫున రెండో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన ఆటగాళ్లలో ఈ జోడీ చేరింది.
ఇక సెంచరీ చేసిన కొద్దిసేపటికే అయ్యర్.. సీన్ అబాట్ బౌలింగ్‌లో క్యాచౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత 34.5 ఓవర్ల వద్ద గిల్‌ను.. గ్రీన్ పెవిలియన్ చేర్చాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా సిక్స్‌లతో రెచ్చిపోయాడు. స్ట్రైక్ రేట్ 100 కు తగ్గకుండా ఆడుతూ 35 బంతుల్లోనే.. వరుసగా ఈ సిరీస్‌లో రెండో అర్ధ సెంచరీ బాదాడు. మరో ఎండ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ (31 పరుగులు : 18 బంతుల్లో 2x2, 2x6) వేగంగా ఆడే ప్రయత్నంలో ఆడమ్ జంపాకు వికెట్ సమర్పించుకున్నాడు.
ఆసీస్-భారత్ మ్యాచ్‌ల్లో (వన్డే) ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగుల టాప్ 5 భాగస్వామ్యాలు..
- వీవీఎస్ లక్ష్మణ్-యువరాజ్ సింగ్.. 213 పరుగులు
- విరాట్ కోహ్లీ-శిఖర్ ధావన్ .. 212 పరుగులు
- విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ .. 207 పరుగులు
- శుభ్‌మన్ గిల్-శ్రేయస్ అయ్యర్ .. 200 పరుగులు
- సచిన్ తెందూల్కర్-వీవీఎస్ లక్ష్మణ్.. 199
-
𝙎𝙚𝙣𝙨𝙖𝙩𝙞𝙤𝙣𝙖𝙡 𝙎𝙝𝙧𝙚𝙔𝘼𝙎𝙎!
— BCCI (@BCCI) September 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
ODI century number 3⃣ for @ShreyasIyer15 💯
Take a bow! 👏👏#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/TUNfwQTAuE
">𝙎𝙚𝙣𝙨𝙖𝙩𝙞𝙤𝙣𝙖𝙡 𝙎𝙝𝙧𝙚𝙔𝘼𝙎𝙎!
— BCCI (@BCCI) September 24, 2023
ODI century number 3⃣ for @ShreyasIyer15 💯
Take a bow! 👏👏#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/TUNfwQTAuE𝙎𝙚𝙣𝙨𝙖𝙩𝙞𝙤𝙣𝙖𝙡 𝙎𝙝𝙧𝙚𝙔𝘼𝙎𝙎!
— BCCI (@BCCI) September 24, 2023
ODI century number 3⃣ for @ShreyasIyer15 💯
Take a bow! 👏👏#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/TUNfwQTAuE
-
📸💯#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/EMz50ZaTqO
— BCCI (@BCCI) September 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">📸💯#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/EMz50ZaTqO
— BCCI (@BCCI) September 24, 2023📸💯#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/EMz50ZaTqO
— BCCI (@BCCI) September 24, 2023
-
🔙 to 🔙 FIFTIES for the skipper 💪
— BCCI (@BCCI) September 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A quick-fire half century from KL Rahul as #TeamIndia inch closer to the 350-run mark!
Follow the Match ▶️ https://t.co/OeTiga5wzy#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/H87gLZIxbd
">🔙 to 🔙 FIFTIES for the skipper 💪
— BCCI (@BCCI) September 24, 2023
A quick-fire half century from KL Rahul as #TeamIndia inch closer to the 350-run mark!
Follow the Match ▶️ https://t.co/OeTiga5wzy#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/H87gLZIxbd🔙 to 🔙 FIFTIES for the skipper 💪
— BCCI (@BCCI) September 24, 2023
A quick-fire half century from KL Rahul as #TeamIndia inch closer to the 350-run mark!
Follow the Match ▶️ https://t.co/OeTiga5wzy#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/H87gLZIxbd
-
Rahul Dravid Son Cricket : అండర్-19 జట్టుకు ఎంపికైన ద్రవిడ్ తనయుడు.. ఏ టోర్నీలో ఆడనున్నాడంటే ?
Varanasi Cricket Stadium : మోదీకి సచిన్, జై షా గిఫ్ట్స్.. ఏమిచ్చారో తెలుసా?