ETV Bharat / sports

బధిరుల కోసం వన్డే సిరీస్​- బాగా ఆడితే సువర్ణావకాశం

Deaf Cricket India: బధిరుల కోసం మూడో కేఎఫ్​సీ వన్డే నేషనల్​ జోన్​ క్రికెట్​ ఛాంపియన్​షిఫ్​ను నిర్వహిస్తున్నట్లు ఐడీసీఏ తెలిపింది. ఈ నెల 23 నుంచి 27 వరకు జరగనున్న ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసినవారికి జాతీయ జట్టుకు ఎంపిక చేసే అవకాశముంది.

deaf cricket india
deaf cricket india
author img

By

Published : Feb 21, 2022, 6:57 PM IST

Deaf Cricket India: బధిర క్రికెటర్ల కోసం ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు మూడో కేఎఫ్​సీ వన్డే నేషనల్ జోన్​ క్రికెట్​ ఛాంపియన్‌షిప్‌ నిర్వహిస్తున్నట్లు ఇండియన్ డెఫ్​ క్రికెట్ అసోసియేషన్ (ఐడీసీఏ) తెలిపింది. ఈ పరిమిత ఓవర్ల టోర్నీని మధ్యప్రదేశ్‌లోని మధ్యాంచల్ క్రికెట్​ సొసైటీ ఆఫ్​ ది డెఫ్​ ఆధ్వర్యంలో జరపనున్నారు.

ఈ టోర్నీ ఓ రకంగా ఖతార్‌లో జరగనున్న బధిర ఐసీసీ టీ20 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జాతీయ జట్టు ఎంపికకు దోహదపడుతుంది. ఇందులో మెరుగైన ప్రదర్శన చేసినవారికి జాతీయ జట్టుకు ఎంపిక చేసే అవకాశముంది.

ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు రూ.లక్ష నగదు, రన్నరప్‌కు రూ.50,000 నగదు బహుమతి లభిస్తుంది. ప్లేయర్ ఆఫ్​ ది సిరీస్​కు రూ.5,100, ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​కు రూ.1,100, బెస్ట్ బౌలర్​ లేదా బ్యాటర్​కు రూ.2,500 నగదు అందజేయనున్నారు.

ఇదీ చూడండి: టీ20 ప్రపంచకప్​ జట్టు.. ఫుల్​ క్లారిటీతో రోహిత్,​ ద్రవిడ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.