ETV Bharat / sports

ODI World cup 2023 Rachin Ravindra : 'భారతీయ మూలాలు ఉన్నా.. వందశాతం కీవీస్​ ప్లేయర్​నే' - వరల్డ్ కప్​ న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర

ODI World cup 2023 Rachin Ravindra : భారత్​ గడ్డపై న్యూజిలాండ్ యువ క్రికెటర్​ రచిన్ రవీంద్ర చెలరేగిపోతున్నాడు. తొలి వరల్డ్ కప్​ ఆడుతున్నా.. సెంచరీలు చేస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో శతకాన్ని బాదాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం రచిన్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

ODI World cup 2023 Rachin Ravindra : 'భారతీయ మూలాలు ఉన్నా.. వందశాతం కీవీస్​ ప్లేయర్​నే'

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2023, 1:03 PM IST

ODI World Cup 2023 Rachin Ravindra : ప్రస్తుతం ప్రపంచకప్​లో భారతీయ మూలాలు కలిగిన న్యూజిలాండ్​ ప్లేయర్ రచిన్ రవీంద్ర అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో తలపడిన మ్యాచ్​లో రచిన్ శతకం సాధించాడు. ఈ మ్యాచ్​లో ఆస్ట్రేలియాలో చేతిలో ఓడినా.. రచిన్​ ఆటతీరు మాత్రం ఆకట్టుకుంది. ఈ వరల్డ్​కప్​లో రెండు శతకాలు చేసి జోరుమీదున్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్​ అనంతరం రచిన్​ మీడియాతో మాట్లాడాడు. భారత్ మూలాలు కలిగి కివీస్ తరపున టోర్నీలో ఆడేటప్పుడు తీవ్ర ఒత్తిడికి గురి కావటం సహజమేనని చెప్పాడు. అయితే కీలక ఇన్నింగ్స్​ ఆడటం మరితం గర్వంగా ఉందన్నాడు.

"టీమ్​ఇండియాతో తలపడుతున్నప్పుడు ఒత్తిడి గురించి ఇప్పటికే చాలా సార్లు నన్ను అడిగారు. నేను సమాధానాలు కూడా ఇచ్చాను. మరోసారి చెబుతున్న నేను వందశాతం కీవీస్ ప్లేయర్​నే. అయితే నేను భారతీయ మూలాలను కలిగి ఉండటం నాకు గర్వంగానూ ఉంది. నా తల్లిదండ్రులు పుట్టి పెరిగిన దేశం వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఇలాంటి ఆటతీరును ప్రదర్శించడం మరింత ఆనందంగా ఉంది. ఇక ఆట విషయానికొస్తే.. భారత్​లో పిచ్​లు బ్యాటింగ్​కు అనుకూలంగా ఉంటాయి. గతంలో నేను ఇక్కడ పర్యటించినప్పుడు గొప్ప ప్రదర్శన చేయలేకపోయాను. ఇప్పుడు మెరుగుపరుచుకున్నాను. ధర్శశాలలో అభిమానులు మద్దతు అద్భుతంగా ఉంది. ఇండియాలో ఎక్కడ ఆడినా.. మైదానంలో అభిమానుల సందడి, అరుపులతో ఉత్సాహపరుస్తున్న తీరు బాగుంటుంది. క్రికెట్ ఆడే వారికి చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఒకటుంటుంది. స్టేడియంలో మన పేరును ఫ్యాన్స్ హోరెత్తిస్తుంటూ కలిగే అనుభూతిని అద్భుతంగా ఉంటుంది". అని రచిన్‌ వెల్లడించాడు.

మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో రచిన్ రవీంద్ర చేసిన సెంచరీ.. అరుదైన ఘనతను సాధించాడు. 23 ఏళ్ల వయసులో వరల్డ్ కప్​లో 2 సెంచరీలు బాదిన టీమ్ఇండియా లెజెండరీ క్రికెటర్​ సచిన్ తెందూల్కర్​ సరసన రచిన్​ చోటు సంపాదించాడు. అలానే ఈ ప్రపంచకప్​లో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 406 పరుగులు చేశాడు. దీంతో అత్యధిక పరుగుల ఆటగాళ్ల జాబితాలో రచిన్ చేరాడు. విరాట్‌ కోహ్లీ (354 పరుగులు)ని వెనక్కినెట్టి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్‌ డికాక్‌ (431 పరుగులు), ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌(413) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

  • An unforgettable tournament 🔥

    New Zealand's Rachin Ravindra reflects on yet another incredible performance at #CWC23 ⬇️https://t.co/mooFBKDYUX

    — ICC Cricket World Cup (@cricketworldcup) October 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Aus vs Nz World Cup 2023 : హోరాహోరీ మ్యాచ్​లో ఆసీస్​దే పైచేయి.. ఉత్కంఠభరిత పోరులో 5 పరుగుల విక్టరీ

ODI World Cup 2023 : ఇంగ్లాండ్​ - న్యూజిలాండ్ మ్యాచ్​... 4658 వన్డేల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.