India Vs Netherlands World Cup 2023 : 2023 వన్డే ప్రపంచ కప్‌లో ఆదివారం ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. నెదర్లాండ్స్‌తో తలపడిన భారత్ 160 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. పండగలా సాగిన ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆటగాళ్లు విశ్వరూపం చూపించారు. ఇక స్టార్ బ్యాటర్లుకూడా బౌలింగ్ వేసి వికెట్లు పడగొట్టారు. అందులో ముఖ్యంగా తన మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకునే టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. బౌలింగ్‌తోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో 'కింగ్' విరాట్ కోహ్లీ కూడా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్ కూడా పడగొట్టాడు. 9 ఏళ్ల తర్వాత వన్డే క్రికెట్‌లో వికెట్ సాధించాడు.
-
#INDvNED#ViratKohli𓃵 #KLRahul
— SaiKumar02 (@SaikumarOG02) November 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Virat Kohli bowling and The Wicket Celebration ❤❤❤️ pic.twitter.com/BAtZpZ6bM5
">#INDvNED#ViratKohli𓃵 #KLRahul
— SaiKumar02 (@SaikumarOG02) November 12, 2023
Virat Kohli bowling and The Wicket Celebration ❤❤❤️ pic.twitter.com/BAtZpZ6bM5#INDvNED#ViratKohli𓃵 #KLRahul
— SaiKumar02 (@SaikumarOG02) November 12, 2023
Virat Kohli bowling and The Wicket Celebration ❤❤❤️ pic.twitter.com/BAtZpZ6bM5
బంతితో రో'హిట్'..
చాలా కాలం తర్వాత బౌలింగ్ చేసిన రోహిత్.. మొదటి ఓవర్‌లోనే వికెట్. ఒకప్పుడు పార్ట్‌టైమ్ బౌలర్‌గా సత్తా చాటిన హిట్‌మ్యాన్.. గాయం కారణంగా బౌలింగ్ వేయడం మానేశాడు. దాదాపు 11 సంవత్సరాల తర్వాత వికెట్ పడగొట్టాడు. రోహిత్ చివరగా 2012లో ఆసీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో వికెట్ తీశాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో రోహిత్ ఇప్పటివరకు 9 వికెట్లు తీశాడు. అంతేకాకుండా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వరల్డ్ కప్‌లో వికెట్ తీసిన భారత సారథిగా రోహిత్ శర్మ నిలిచాడు.
-
Rohit Sharma Agression 🔥🔥
— Roman (@SkyXRohit1) November 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Batting mein cool 😎 Bowling mein fire hai🔥#INDvNED | #RohitSharma#ShreyasIyer | | #ViratKohli
|#KLRahul #Kanguva #BrandedFeatures #crackerspic.twitter.com/Gs8BCfvmd0
">Rohit Sharma Agression 🔥🔥
— Roman (@SkyXRohit1) November 12, 2023
Batting mein cool 😎 Bowling mein fire hai🔥#INDvNED | #RohitSharma#ShreyasIyer | | #ViratKohli
|#KLRahul #Kanguva #BrandedFeatures #crackerspic.twitter.com/Gs8BCfvmd0Rohit Sharma Agression 🔥🔥
— Roman (@SkyXRohit1) November 12, 2023
Batting mein cool 😎 Bowling mein fire hai🔥#INDvNED | #RohitSharma#ShreyasIyer | | #ViratKohli
|#KLRahul #Kanguva #BrandedFeatures #crackerspic.twitter.com/Gs8BCfvmd0
9 మంది బౌలింగ్..
నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో ఆసక్తిక ఘటన జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా తరఫున మొత్తం 9 బౌలింగ్ చేశారు. వికెట్ కీపర్ కేఎల్ రాహుమ్, శ్రేయస్ అయ్యర్ మినహా.. అందరూ బౌలింగ్ వేయడం విశేషం. అంతేకాకుండా వన్డే వరల్డ్‌ప్‌లో ఒక మ్యాచ్‌లో 9 మంది బౌలింగ్ వేయడం ఇది మూడోసారి. 1987లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ప్లేయర్లు తొమ్మిది మంది బౌలింగ్ చేశారు. 1992 వరల్డ్ కప్ మొగా టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ తరఫున 9 మంది బౌలింగ్ చేశారు. 31 ఏళ్ల తర్వాత రోహిత్ సేన 9 మంది బౌలింగ్ చేసి.. రికార్డును సమం చేసింది.
రాయుడు, బెన్‌స్టోక్స్‌కు చెన్నై గుడ్‌బై - 2024 ఐపీఎల్ ప్లేయర్ల రిలీజ్ లిస్ట్ ఇదే
నెదర్లాండ్స్‌పై భారత్ గ్రాండ్ విక్టరీ టోర్నీలో వరుసగా తొమ్మిదో విజయం నమోదు