ETV Bharat / sports

Australia Vs South Africa World Cup 2023 : టాస్​ గెలిచి బౌలింగ్​ను ఎంచుకున్న ఆస్ట్రేలియా - 2023 ప్రపంచకప్ ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా

Australia Vs South Africa World Cup 2023 : వన్డే ప్రపంచకప్​లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా - సౌతాఫ్రికా మధ్య మ్యాచ్​ జరగనుంది. ఈ క్రమంలో టాస్​ గెలుచుకున్న ఆస్ట్రేలియా బౌలింగ్​ను ఎంచుకుంది.

Australia Vs South Africa World Cup 2023

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2023, 1:35 PM IST

Updated : Oct 12, 2023, 2:30 PM IST

Australia Vs South Africa World Cup 2023 : 2023 వన్డే ప్రపంచకప్​లో భాగంగా ఆస్ట్రేలియా - సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరుకు లఖ్​నవూ క్రికెట్ స్టేడియం వేదికైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే గతమ్యాచ్​ ఫామ్​ కొనసాగిస్తూ.. మరో విజయం సాధించాలని సౌతాఫ్రికా భావిస్తోంది. ఇక మరోవైపు ఈ మ్యాచ్​తోనైన గెలుపు బాటపట్టి మెగా టోర్నీలో బోణీ కొట్టాలని ఆసీస్ తహతహలాడుతోంది.

ఇరు జట్లలోనూ మార్పులు.. ఈ మ్యాచ్​లో రెండు దేశాలు, తమతమ జట్లలో కీలక మార్పులు చేశాయి. సౌతాఫ్రికాలో బౌలర్ గార్లాడ్ స్థానంలో షమ్సీ జట్టులోకి వచ్చాడు. ఇక ఆసీస్ జట్టులో ఏకంగా రెండు మార్పులు చేసింది మేనేజ్​మెంట్. ఆల్​రౌండర్​ కామెరూన్ గ్రీన్ స్థానంలో మార్కస్ స్టోయినిస్ తీసుకోగా.. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ ప్లేస్​లో జోష్ ఇంగ్లిస్​ను బరిలోకి దింపింది.

"పిచ్ చూడడానికి కొంచెం తేమగా ఉంది. ఇక గత మ్యాచ్​లో భారత్​పై మేం ఇంకొన్ని పరుగులు చేయాల్సింది. అయినప్పటికీ మా బౌలింగ్ పట్ల సంతృప్తికరంగా ఉన్నాం. సౌతాఫ్రికా ఈ టోర్నీని ఘనంగా ఆరంభించింది. వారితో ఆడడం ఎప్పుడూ సవాలుతో కూడుకున్నదే" అని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్​ అన్నాడు.

వన్డేల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. గత ఐదింట్లో నాలుగు మ్యాచ్​లు నెగ్గింది. అలాగే ఆస్ట్రేలియా గతనెల సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. అక్కడ ఆతిథ్య జట్టుతో ఆసీస్ మూడు టీ20, ఐదు వన్డే మ్యాచ్​ల సిరీస్​ ఆడింది. అయితే టీ20 సిరీస్​ను ఆసీస్​ క్లీన్​స్వీప్ చేయగా.. వన్డే సిరీస్​ను సౌతాఫ్రికా 2-3తో దక్కించుకుంది.

సౌతాఫ్రికా (తుది జట్టు): క్వింటన్ డి కాక్, టెంబా బావుమా, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, లుంగి న్గిడి, కగిసో రబడ, తబ్రైజ్ షమ్సీ

ఆస్ట్రేలియా (తుది జట్టు): డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిష్​, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

Last Updated : Oct 12, 2023, 2:30 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.