Marriage Proposal to Mohammed Shami: 2023 వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా పేసర్ షమీ (Mohammed Shami) మంచి జోరు మీదున్నాడు. ఆడింది నాలుగు మ్యాచ్‌లే అయినా.. ఏకంగా 16 వికెట్లు తీసి దుమ్ములేపాడు. దీంతో.. టాక్ ఆఫ్ ది టోర్నీ అయ్యాడు. అతని ప్రదర్శనపై ఇటీవల మాజీ భార్య హసీన్ జహాన్ కూడా కామెంట్ చేసింది. తాజాగా బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ స్పందించింది. అతన్ని మెచ్చుకోవడమే కాదు.. ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటానంటూ చెప్పుకొచ్చింది. దీంతో.. సోషల్ మీడియాలో షమీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాడు. ఇంతకీ.. షమీని ఆమె ఎందుకు వద్దన్నది? ఈమె ఎందుకు కావాలంటోంది? అని డిస్కస్ చేసుకుంటున్నారు నెటిజన్లు!
షమీ అరుదైన ఘనత, ఆ ఇద్దరు దిగ్గజాల రికార్డ్ బద్దలు
పాయల్ ఘోష్ స్టేట్మెంట్ ఇదీ : షమీ బౌలింగ్ తనకు తెగ నచ్చిందని పాయల్ ఘోష్ చెప్పింది. అంతే కాదు.. "షమీని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అంటూ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. అయితే.. ఇందుకు ఓ షరతు కూడా పెట్టింది. షమీ తన ఇంగ్లీష్‌ను మెరుగుపర్చుకుంటే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పడం గమనార్హం. ఆమె పోస్టుపై.. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. "ప్రేమకు భాషతో పనేంటి?" అని కొందరు కామెంట్లు చేయగా.. "షమీ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి" అంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.
ఎవరీ పాయల్ ఘోష్..? : బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలైన ఈమె మన తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా పరిచయమే. తెలుగులో మంచు మనోజ్ నటించిన ‘ప్రయాణం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన పాయల్.. ఆ తర్వాత పలు సినిమాల్లో కన్పించింది. ఎన్టీఆర్ "ఊసరవెల్లి" సినిమాలో తమన్నాకు స్నేహితురాలి పాత్రలో కూడా కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయిన పాయల్.. 2020లో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం రామ్‌దాస్ అథవాలేకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది.
Ind vs Nz World Cup 2023 : గిల్, షమీ అరుదైన రికార్డులు.. తొలి బ్యాటర్‌గా శుభ్‌మన్ ఘనత
షమీ మాజీ భార్య కామెంట్స్ ఇలా: వరల్డ్ కప్‌లో షమీ ప్రదర్శనపై.. మాజీ భార్య హసీన్ జహాన్ కూడా స్పందించారు. ఓ డిబేట్ లో పాల్గొన్న ఆమె షమీ ప్రదర్శన గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. షమీ ఇంకా బాగా ఆడాలని కోరుకుంది. అతను టీమ్ఇండియాలో కొనసాగాలి అంటూ కోరుకుంది. అయితే.. ఆమె వ్యాఖ్యలకు గల కారణాన్ని కూడా తెలిపింది. "షమీ బాగా ఆడితే టీమ్ఇండియాలో కొనసాగుతాడు. ఇంకా బాగా సంపాదిస్తాడు. అతను బాగా సంపాదిస్తే మాకు కూడా సురక్షితంగా ఉంటుంది. షమీ ఇంకా బాగా ఆడాలి" అంటూ జహాన్ ఆకాంక్షించడం గమనార్హం. హసీనా జహాన్ వ్యాఖ్యలకు నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. అతని కెరీర్ నాశనం అవ్వాలని కోరుకున్న ఆమే.. అతను బాగా ఆడాలని ఆకాంక్షిస్తోందని అంటున్నారు.
Ind Vs Eng World Cup 2023 : షమీ మెరుపులు.. ఇంగ్లాండ్‌పై టీమ్ఇండియా ఘన విజయం
Shami and Hasin Jahan Issue: ఇలా.. షమీ మాజీ భార్య కామెంట్స్‌తోపాటు బాలీవుడ్ నటి అతన్ని పెళ్లి చేసుకుంటానంటూ స్టేట్మెంట్ ఇవ్వడంతో.. షమీ వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశమైంది. షమీ-హసీన్ 2014లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. తర్వాత కాలంలో ఈ దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలోనే 2018లో షమీపై హసీన్ గృహ హింస, దాడి, వరకట్న వేధింపులు వంటి ఆరోపణలు చేసింది. కోర్టును కూడా ఆశ్రయించింది. దీంతో.. షమీపై దాడి, హత్యాయత్నం, గృహ హింస తదితర అభియోగాలపై కేసు నమోదైంది. 2019లో కోల్‌కతాలోని అలిపోర్ కోర్టు.. అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే.. దీన్ని షమీ సెషన్స్ కోర్టులో సవాల్ చేయగా.. అరెస్టు వారెంట్, క్రిమినల్ విచారణ ప్రక్రియపై స్టే విధిస్తూ.. 2019 సెప్టెంబర్‌లో సెషన్స్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Ind Vs Nz World cup 2023 : శతక్కొట్టిన మిచెల్.. షమీ పాంచ్ పటాకా.. టీమ్ఇండియా టార్గెట్ ఎంతంటే ?
షమీపై గృహ హింస కేసు నమోదు చేసినప్పుడు.. తనకు భరణం కింద నెలకు రూ.10 లక్షలు ఇవ్వాలని ఆమె కోర్టులో కేసు వేసింది. దీనిపై ఈ ఏడాది జనవరిలో విచారణ జరిపిన కోల్‌కతా హైకోర్టు.. హసీన్ (Hasin Jahan)కు భరణం కింద ప్రతి నెలా రూ.1.30లక్షలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
Fans Pray for Shami: ఈ వివాదం.. ఫామ్ లేమి నేపథ్యంలో షమీ కెరీర్ పూర్తిగా ముగిసిపోవాల్సిందే. కానీ, షమీ న్యాయపోరాటం చేశాడు. కోర్టు కూడా షమీకి ఊరటనిచ్చింది. ఈ క్రమంలో అతడు మళ్లీ కెరియర్‌పై దృష్టి పెట్టాడు. కఠోర శ్రమతో.. మళ్లీ ఫామ్ సాధించి తిరిగి టీమ్ఇండియాలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు వరల్డ్ కప్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా రాణిస్తున్నాడు. అతని కెరియర్ ఇలాగే కొనసాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అదరగొట్టిన షమీ, చిత్తుగా ఓడిన శ్రీలంక- రికార్డ్ విజయంతో సెమీస్‌లోకి భారత్
షమీకి షాక్.. భార్యకు భరణం చెల్లించాలంటూ కోర్టు ఆదేశం.. ప్రతినెల ఎన్ని లక్షలంటే?