ETV Bharat / sports

అహ్మదాబాద్ పిచ్​కు ఐసీసీ యావరేజ్ రేటింగ్​ - ఆ స్టేడియానికి కూడా! - ahmedabad narendra modi pitch rating

ICC World Cup Pitch Ratings : వన్డే ప్రపంచ కప్​కు వేదికలుగా నిలిచిన కొన్ని స్టేడియాల పిచ్​లకు అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్​ (ఐసీసీ) రేటింగ్ ఇచ్చింది. ఆ వివరాలు మీ కోసం

ICC World Cup Pitch Ratings
ICC World Cup Pitch Ratings
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 10:21 AM IST

Updated : Dec 8, 2023, 10:56 AM IST

ICC World Cup Pitch Ratings : భారత్ వేదికగా ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్​కు విశేషాదరణ దక్కింది. తొలి మ్యాచ్ నుంచి ఆఖరి వరకు ఎంతో ఉత్కంతగా సాగిన ఈ పోరులో తుది మ్యాచ్​ భారత్ x ఆస్ట్రేలియా మధ్య జరిగింది. అహ్మదాబాద్​లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్​లో ఇరు జట్లు పోటాపోటీగా ఆడినప్పటికీ విజయం మాత్రం ఆస్ట్రేలియా జట్టుకు దక్కింది. అయితే వన్డే ప్రపంచ కప్​కు వేదికలుగా నిలిచిన కొన్ని స్టేడియాల పిచ్​లకు అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్​ (ఐసీసీ) రేటింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్​లోని నరేంద్రమోదీ స్టేడియానికి యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. రెండో సెమీ ఫైనల్స్​కు వేదికైన కోల్​కతా ఈడెన్​ గార్డెన్స్​ కూడా అదే రేటింగ్​ను ఇచ్చింది.

ఫైనల్స్​లో ఉపయోగించిన పిచ్‌కు ఐసీసీ మ్యాచ్ రిఫరీతో పాటు జింబాబ్వే మాజీ బ్యాట్స్‌మెన్ ఆండీ పైక్రాఫ్ట్ రేటింగ్ ఇచ్చారు. ఇక ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన సెమీ-ఫైనల్​కు వేదికైన కోల్‌కతాలోని ఈడెన్​ గార్డెన్​ పిచ్​కు మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ రేటింగ్ ఇచ్చాడు.

గతంలోనూ భారత్‌తో ఆస్ట్రేలియా, పాకిస్థాన్​ ఆడిన మ్యాచుల్లో పిచ్‌లకు ఐసీసీ రేటింగ్ ఇచ్చింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియా, భారత్ తలపడ్డాయి. ఆ తర్వాత అహ్మదాబాద్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు ఢీకొట్టాయి. అయితే ఈ రెండు పిచ్‌లకు 'యావరేజ్' రేటింగ్ ఇచ్చింది. దీనిపై అప్పట్లో టీమ్​ఇండియా హెడ్​ కోచ్​ రాహుల్​ ద్రవిడ్ అసహనం వ్యక్తం చేశాడు. కేవలం హైస్కోరింగ్ మ్యాచులపైనే ఫోకస్ పెట్టడం అనేది కరెక్ట్ కాదని ఆయన అన్నాడు. అది కూడా వన్డేల్లో అలా చేయకూడదని, బ్యాటర్ల టెక్నిక్‌కు ఓ పరీక్ష ఉండాలని చెప్పాడు.

'ఆ రెండు పిచ్‌లకు ఐసీసీ మేనేజ్​మెంట్ యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. దీన్ని నేను ఏమాత్రం సమర్థించను. అవి చాలా మంచి వికెట్లని నా ఫీలింగ్' అని ద్రవిడ్ చెప్పాడు. మంచి పిచ్ అంటే భారీ స్కోర్లు నమోదవ్వాలనే ఆలోచనే తప్పని ఆయన అభిప్రాయపడ్డాడు. స్పిన్ బౌలింగ్, స్ట్రైక్ రొటేషన్, ఎఫెక్టివ్ బ్యాటింగ్ ఇలా ఎన్నో స్కిల్స్‌ను మెచ్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశాడు.

ఎంత వ్యతిరేకత వచ్చినా తగ్గలేదు - ఫ్రెండ్లీ స్పిరిట్​తో ముందుకు సాగిన మిస్టర్ డిపెండబుల్​

ODI World Cup IND VS PAK : నీలి సంద్రంలా మోదీ స్టేడియం.. రికార్డ్ బద్దలు.. లక్షమంది జాతీయ గీతం పాడితే..

Last Updated : Dec 8, 2023, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.