ICC Men's Cricket World Cup 2023 Qualifier : భారత్ వేదికగా ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌కు ముందే వెస్టిండీస్ జట్టుకు నెదర్లాండ్స్ గట్టి షాకిచ్చింది. జింబాబ్వే గడ్డపై జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ 2023 క్వాలిఫయర్ మ్యాచ్‌లో బలమైన జట్టు విండీస్‌తో జరిగిన పోరులో నెదర్లాండ్స్ ఆటగాళ్లు దూకుడును ప్రదర్శించి కరేబియన్లకు చుక్కలు చూపించారు. విండీస్ టీమ్ భారీ స్కోరు చేసినప్పటికీ.. ఆఖరి వరకూ పోరాడి నిలిచి నెదర్లాండ్స్.. మ్యాచ్‌ను డ్రాగా మార్చింది . దీంతో సూపర్ ఓవర్లో చెలరేగిన డచ్ ఆటగాడు వాన్ బీక్ ఆ జట్టుకు సూపర్ డూపర్ విక్టరీని అందించాడు. అయితే నెదర్లాండ్స్ జట్టులో ఆడుతున్న మన ఆంధ్ర కుర్రాడు తేజ నిడమనూరు.. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మేటి ఇన్నింగ్స్‌ను ఆడి టీమ్ గెలిచేందుకు సహాయపడ్డాడు. ఈ అనూహ్య విజయంతో నెదర్లాండ్స్ సూపర్ సిక్స్ జట్టుల జాబితాలో చోటు దక్కించుకుంది.
భారీ టార్గెట్‌తో బరిలోకి దిగినప్పటికీ ఎక్కడా తడబడలేదు నెదర్లాండ్స్ ఆటగాళ్లు. అయితే ఈ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన తేజ నిడమనూరు బ్యాటింగ్‌లో తన దూకుడును ప్రదర్శించి జట్టు గెలుపులో కీలకంగా వ్యవహరించాడు. 76 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 111 పరుగులు చేసి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఇతడికి తోడుగా నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (47 బంతుల్లో 67, 6 ఫోర్లు, 1 సిక్స్) కూడా విజృంభించాడు.
విండీస్ విధ్వంసం..
West Indies ICC : ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్.. బౌలింగ్‌లో పెద్దగా అనుభవం లేకున్నా విండీస్ ఆటగాళ్ల ఆటకట్టించింది. ఓపెనర్లుగా వచ్చిన బ్రాండన్ కింగ్ (76), చార్లెస్ (54) ద్వయం తొలి వికెట్‌కు 101 పరుగులు జోడించి అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఇక చివర్లో కీమో పాల్ కూడా 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో రెచ్చిపోవడంతో కరేబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 374 పరుగులు చేసింది.
నెదర్లాండ్స్ ఇన్నింగ్స్..
West Indies vs Netherlands : డచ్ టీమ్ ఓపెనర్ విక్రమ్‌జీత్ సింగ్.. 32 బంతుల్లో 5 బౌండరీల సాయంతో 37 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఓపెనర్ మ్యాక్స్ ఓడౌడ్ (36) కూడా రాణించాడు. వీరికి తోడు ఆట చివర్లో వచ్చిన బ్యాటర్ లొగన్ వాన్ బీక్ 14 బాల్స్‌లోనే 3 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 28 రన్స్ చేశాడు. విండీస్ నిర్దేశించిన లక్ష్యానికి వీరికి 9 పరుగుల అవసరం కాగా 8 పరుగులు మాత్రమే చేయడంతో మ్యాచ్ డ్రాగా మారింది. దీంతో సూపర్ ఓవర్ ద్వారా ఊహించని విజయాన్ని అందుకుంది నెదర్లాండ్స్.
గట్టెకించిన సూపర్ ఓవర్..
West Indies vs Netherlands super over : ఈ సూపర్ ఓవర్లో తొలుత నెదర్లాండ్స్ బ్యాటింగ్ చేసింది. అయితే మంచి జోరు మీదున్న వాన్ బీకే బ్యాటింగ్‌కు దిగాడు. జేసన్ హోల్డర్ వేసిన సూపర్ ఓవర్లో 4,6,4,6,6,4 షాట్లతో ఏకంగా 30 పరుగులు పట్టేశాడు. ఆ తర్వాత అతడి బౌలింగ్‌లోనే విండీస్‌ను 8 పరుగులకే చేతులెత్తేసింది. ఈ ఓవర్లో కరేబియన్లను దెబ్బతీయడమే కాకుండా రెండు వికెట్లు పడగొట్టాడు వాన్. ఇది అతడి కెరీర్లో మరిచిపోలేని చిరస్మరణీయ ఇన్నింగ్స్ కావడం విశేషం. ఇక ఈ ఓటమితో విండీస్ ప్రపంచ కప్ క్వాలిఫైయింగ్ ఆశలు దాదాపు అనుమానమే. ఆ జట్టు సూపర్ సిక్సెస్ లిస్ట్‌లో చేరినా టాప్-2లో నిలవడం మాత్రం కాస్త కష్టమే.
-
Logan van Beek in the Super Over against West Indies:
— ICC (@ICC) June 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
With the bat: 4 6 4 6 6 4 💥
With the ball: 8/2 with one ball to spare 👊
SENSATIONAL 🤩#CWC23 | #WIvNED: https://t.co/nJHz2HouZx pic.twitter.com/FXuUd0R56J
">Logan van Beek in the Super Over against West Indies:
— ICC (@ICC) June 26, 2023
With the bat: 4 6 4 6 6 4 💥
With the ball: 8/2 with one ball to spare 👊
SENSATIONAL 🤩#CWC23 | #WIvNED: https://t.co/nJHz2HouZx pic.twitter.com/FXuUd0R56JLogan van Beek in the Super Over against West Indies:
— ICC (@ICC) June 26, 2023
With the bat: 4 6 4 6 6 4 💥
With the ball: 8/2 with one ball to spare 👊
SENSATIONAL 🤩#CWC23 | #WIvNED: https://t.co/nJHz2HouZx pic.twitter.com/FXuUd0R56J