ETV Bharat / sports

వన్డే వరల్డ్​ కప్​ 2023.. మాట మార్చిన పాకిస్థాన్.. అక్కడైతేనే ఆడతామంటూ.. - world cup 2023 icc bcci pakistan

పాకిస్థాన్​ స్వరం మార్చింది. భారత్​లో వన్డే వరల్డ్​ ఆడబోమని చెప్పిన పాక్..​ ఇప్పుడు ఇండియాలోనే ఆడతామని చెబుతోంది. ఈ మేరకు ఆ దేశ క్రికెట్​ బోర్డు.. ఐసీసీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

pakistan cricket board on world cup
pakistan cricket board on world cup
author img

By

Published : Apr 11, 2023, 6:55 PM IST

పాకిస్థాన్​ మాట మార్చింది. భారత్​లో వన్డే వరల్డ్​ కప్​ ఆడడానికి.. ఆ దేశ క్రికెట్​ బోర్డు​ వేదికలను ఎంపిక చేసుకుంటోంది. ఇండియాలోని 12 నగరాల్లో జరగబోయే ఈ మెగా టోర్నీలో.. భద్రతా కారణాల దృష్ట్యా తాము చెన్నై, కోల్​కతా వేదికల్లోనే అన్ని మ్యాచ్​లు ఆడతామని పాకిస్థాన్​ చెబుతోంది. ఈ మేరకు పాక్​.. ఐసీసీ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతోందని ఐసీసీ వర్గాల సమాచారం. అయితే, వరల్డ్​ కప్​నకు సంబంధించిన అన్నీ​ మ్యాచ్​లు ఎక్కడ నిర్వహించాలనేది బీసీసీఐ, భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో.. ఒక వేళ ఇండియా ఛాన్స్​ ఇస్తే.. కోల్​కతా, చెన్నై లాంటి ప్రదేశాల్లో ఆడడానికి పాకిస్థాన్ ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

2016లో కోల్​కతాలో పాకిస్థాన్​ టీ20 వరల్డ్​ కప్​ మ్యాచ్​ ఆడింది. అక్కడ సెక్యూరిటీ పాక్​కు నచ్చింది. అలాగే చెన్నైలో కూడా పాకిస్థాన్​కు కొన్ని మంచి అనుభవాలు ఉన్నాయి. దీంతో చెన్నై వేదిక కూడా తమకు సురక్షితమని భావిస్తోంది పాక్​ జట్టు. ఈ మెగా టోర్నీలో ముఖ్యమైన ఘట్టం.. ఇండియా-పాకిస్థాన్​ మధ్య జరిగే మ్యాచ్​లే. అహ్మదాబాద్​లో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియం సామర్థ్యం లక్షా 32 వేలు. ఈ వేదికలో భారత్​-పాక్​ మ్యాచ్ జరిగితే చాలా డబ్బులు వస్తాయి. కానీ ఈ వేదికలో ఫైనల్ మ్యాచ్​ జరుగుతోంది. అయితే, ఐసీసీ.. ఈ వరల్డ్​ కప్​ షెడ్యూల్​ విడుదల చేస్తేనే ఈ విషయంపై స్పష్టత వస్తుంది.

ఐసీసీ ఈవెంట్స్​ కమిటీ, ఆతిథ్య దేశం క్రికెట్​ బోర్డు బీసీసీఐతో కలసి కొన్ని నెలల్లో వరల్డ్​ కప్​ ప్రణాళిక రూపొందిస్తాయి. దానికి అనుగుణంగా అభిమానులు వారి ప్రయాణాలను ప్లాన్​ చేసుకోవచ్చు.
ఆసియా కప్​ తాము తటస్థ వేదికల్లో ఆడతామని ఇంతకుముందు భారత్​కు తేల్చిచెప్పింది. దీంతో తమ దేశంలో భారత్​ ఆసియా కప్​ ఆడకుంటే.. తాము కూడా ఇండియాలో వన్డే వరల్డ్​ కప్​ ఆడబోమని పాకిస్థాన్​ చెప్పింది. ఆ తర్వాత తమ వరల్డ్​ మ్యాచ్​లను బంగ్లాదేశ్​ లేదా శ్రీలంక దేశాల్లో వేదికల్లో నిర్వహించాలని షరతులు సైతం విధించింది. అయితే ఇక ఈ ప్రతిపాదనలకు బీసీసీఐ ససేమిరా ఒప్పుకోదని తెలిసిన పాక్​ బోర్డు ఇప్పుడు మాట మార్చింది.

భారత్​ ఆతిథ్యమిస్తున్న ఈ వన్డే వరల్డ్​ కప్​ అక్టోబర్​ 5న లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఫైనల​తో సహా 46 మ్యాచ్​లకు దేశవ్యాప్తంగా ఉన్న 12 నగరాలు వేదిక కానున్నాయి. అందులో పాకిస్థాన్​ కోరుకుంటున్న చెన్నై, కోల్​కతాతో.. పాటు అహ్మదాబాద్​, లఖ్​నవూ, ముంబయి, రాజ్​కోట్​, బెంగళూరు, దిల్లీ, ఇందౌర్​, గువాహటి, హైదరాబాద్​, ధర్మశాల ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.