ETV Bharat / sports

'బ్యాట్స్​మెన్​ కాదు బ్యాటర్​ అనే పిలవాలి'

author img

By

Published : Oct 7, 2021, 3:11 PM IST

'బ్యాట్స్​మెన్'​ పదానికి బదులుగా 'బ్యాటర్'​ను వినియోగించాలంటూ ఇటీవల మెరిల్​బోన్​ క్రికెట్​ క్లబ్​ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది ఐసీసీ(ICC News). అక్టోబర్ 17నుంచి ప్రారంభం కాబోయే టీ20 ప్రపంచకప్(T20 World Cup)​ నుంచి ఈ కొత్త పదాన్ని క్రికెబ్​ నిబంధనల చట్టంలోకి చేరుస్తామని చెప్పింది.

bat
బ్యాటర్

'బ్యాట్స్​మెన్'​ పదాన్ని మార్చనున్నట్లు ప్రకటించింది ఐసీసీ(ICC News). దాని స్థానంలో లింగ బేధం చూపని 'బ్యాటర్'​(batsman replaced by batter) పదాన్ని వినియోగిస్తామని తెలిపింది. క్రికెట్​లో లింగ వివక్షత ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. టీ20 ప్రపంచకప్(T20 World Cup)​ ప్రారంభం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

"నాలుగేళ్లుగా బ్యాట్స్​మెన్​ పదాన్ని వినియోగించడం లేదు. కామెంటరీ, ఆర్గనైజేషన్​ ఛానళ్లలోనూ బ్యాటర్ అనే అంటున్నాం. ఎమ్​సీసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. క్రికెట్​ నిబంధనల చట్టంలో దాన్ని అమలుచేసేలా చేస్తాం. బౌలర్, ఫీల్డర్​ మాదిరిగానే ఈ బ్యాటర్​ అనే పదం కూడా అందరికీ ఆపాదించేలా ఉంటుంది."

-ఐసీసీ ప్రకటన

గత నెల మెరిల్​బోన్ క్రికెట్ క్లబ్ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఐసీసీ.. తాజాగా ఈ నిబంధనకు మద్దతు పలుకుతున్నట్లు తెలిపింది.

అక్టోబర్ 17నుంచి నవంబర్ 14 వరకు యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్​ జరగనుంది.

ఇదీ చదవండి:ఆర్సీబీకి శాపంగా హైదరాబాద్.. ప్రతిసారి అడ్డంకే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.