అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో.. టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ, యువ వికెట్‌కీపర్ రిషభ్ పంత్ తమ స్థానాలను కాపాడుకున్నారు. కోహ్లీ ఐదో స్థానంలో ఉండగా.. రోహిత్, పంత్ సంయుక్తంగా ఆరో స్థానాన్ని పంచుకున్నారు.
-
Tim Southee’s seven wickets in the first Test against England has pushed him to No.3 in the @MRFWorldwide ICC Test Rankings for bowling 📈 pic.twitter.com/9nd2ekGiPS
— ICC (@ICC) June 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Tim Southee’s seven wickets in the first Test against England has pushed him to No.3 in the @MRFWorldwide ICC Test Rankings for bowling 📈 pic.twitter.com/9nd2ekGiPS
— ICC (@ICC) June 9, 2021Tim Southee’s seven wickets in the first Test against England has pushed him to No.3 in the @MRFWorldwide ICC Test Rankings for bowling 📈 pic.twitter.com/9nd2ekGiPS
— ICC (@ICC) June 9, 2021
న్యూజిలాండ్ ఓపెనర్ డేవన్ కాన్వే ఐసీసీ ర్యాంకింగ్స్‌లోకి తొలిసారి ప్రవేశించాడు. 447 పాయింట్లతో 77వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు కాన్వే. ఈ క్రమంలోనే తొలిసారే అత్యధిక పాయింట్లతో ర్యాంకింగ్స్‌లోకి వచ్చిన కివీస్ తొలి బ్యాట్స్‌మన్‌గా ఫీట్ నమోదు చేశాడు.
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 223 పరుగులు చేశాడు కాన్వే. ఇతని కంటే ముందు ఇంగ్లాండ్ ఆటగాడు రీ ఫోస్టర్ ఆసీస్‌పై అరంగేట్రం మ్యాచ్‌లోనే 287 పరుగులు చేశాడు. 449 టెస్ట్ పాయింట్లతో ర్యాంకింగ్స్‌లోకి ప్రవేశించాడు. బంగ్లాతో జరిగిన టెస్ట్‌లో విండీస్ ప్లేయర్ మేయర్స్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే 250 రన్స్ చేసి 448 పాయింట్లు సాధించాడు. టీ20ల్లో నాలుగో స్థానంలో ఉన్న కాన్వే.. వన్డేల్లో 121వ స్థానంలో కొనసాగుతున్నాడు.
కివీస్ బౌలర్ టిమ్ సౌథీ కెరీర్లో అత్యుత్తమ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌పై ఆరు వికెట్ల ప్రదర్శనతో మెరిసిన సౌథీ మూడో ర్యాంకును కైవసం చేసుకున్నాడు.
ఇదీ చదవండి: 'టీవీలో సచిన్ ఆట చూసి ఆ షాట్లు నేర్చుకున్నా'