ICC Team of 2021: ఐసీసీ 2021 ఏడాదికి అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఒక్క భారత క్రికెటర్‌కు కూడా చోటు దగ్గలేదు. దీంతో ఘోర అవమానం జరిగినట్లు అయింది. టీ20 ప్రపంచకప్ 2021లో గ్రూపు దశలోనే నిష్క్రమించిన టీమ్ఇండియా.. గతేడాది పొట్టి ఫార్మాట్లో పెద్దగా రాణించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
కాగా ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్లో ముగ్గురు పాక్ ఆటగాళ్లకు చోటు లభించడం విశేషం. అంతేకాకుండా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను ఐసీసీ కెప్టెన్‌గా ఎంచుకుంది. బాబర్‌తో పాటు గతేడాది టీ20ల్లో రాణించిన పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్, పేసర్ షాహిన్ ఆఫ్రిదిలకు ఈ జట్టులో చోటు దక్కింది. కాగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్టుల నుంచి ఇద్దరు చొప్పున ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు లభించింది.
-
The ICC Men's T20I Team of the Year certainly packs a punch 👊
— ICC (@ICC) January 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
More 👉 https://t.co/TtQKyBL3rw pic.twitter.com/mhfNsE2mU3
">The ICC Men's T20I Team of the Year certainly packs a punch 👊
— ICC (@ICC) January 19, 2022
More 👉 https://t.co/TtQKyBL3rw pic.twitter.com/mhfNsE2mU3The ICC Men's T20I Team of the Year certainly packs a punch 👊
— ICC (@ICC) January 19, 2022
More 👉 https://t.co/TtQKyBL3rw pic.twitter.com/mhfNsE2mU3
ఐసీసీ టీ20 టీమ్
జోస్ బట్లర్, హమ్మద్ రిజ్వాన్, బాబర్, మార్క్రమ్(దక్షిణాఫ్రికా), మిచెల్ మార్ష్(ఆస్ట్రేలియా), డేవిడ్ మిల్లర్(దక్షిణాఫ్రికా), వనిందు హసరంగ(శ్రీలంక), తబ్రేజ్ షంషి(దక్షిణాఫ్రికా), జోష్ హేజిల్‌వుడ్(ఆస్ట్రేలియా), ముస్తాఫిజుర్ రెహ్మాన్(బంగ్లాదేశ్), షాహీన్ అఫ్రిది(పాకిస్థాన్)లు ఐసీసీ ఎంచుకుంది. గతేడాది అంతర్జాతీయ టీ20ల్లో ప్రదర్శన ఆధారంగానే వీరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఐసీసీ టీ20 జట్టులో స్మృతి మంధాన
ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ మహిళ టీ20 జట్టులో భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు చోటు దక్కింది. గతేడాది పొట్టి ఫార్మాట్లో 225 పరుగులు చేసి.. 31.87 సగటుతో రాణించడంతో మంధానకు ఆ జట్టులో స్థానం లభించింది.
ఇదీ చూడండి: Maxwell Record: మ్యాక్స్‌వెల్ విధ్వంసం.. 41 బంతుల్లో సెంచరీ