ETV Bharat / sports

ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్​ ది మంత్' రేసులో మయాంక్

author img

By

Published : Jan 8, 2022, 4:26 PM IST

ICC Player of the Month: డిసెంబర్​ నెలకు సంబంధించి 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్' నామినేషన్లను ప్రకటించింది ఐసీసీ. ఈ జాబితాలో భారత జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్, న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ చోటు దక్కించుకున్నారు.

mayank aggarwal
మయాంక్ అగర్వాల్

ICC Player of the Month: డిసెంబర్​ నెలకు సంబంధించి 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్'​ జాబితాను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లను గుర్తించి ప్రతి నెల వారికి అవార్డులను ఇస్తుంటుంది ఐసీసీ. అందులో భాగంగానే డిసెంబర్ నెల కోసం టాప్ ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది.

పురుషుల కేటగిరీలో టీమ్​ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్, న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్​ పేర్లను నామినేట్ చేసింది ఐసీసీ.

టీమ్ఇండియాలో రోహిత్ శర్మ, శుభ్​మన్​ గిల్, కేఎల్​ రాహుల్​ కొన్ని మ్యాచ్​లకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు మయాంక్. న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్​లో మెరుగైన ప్రదర్శన చేశాడు. రెండు మ్యాచ్​ల్లోనే 276 పరుగులు చేశాడు.

భారత్​-న్యూజిలాండ్ టెస్టు సిరీస్​లో భాగంగా కివీస్​ యువ స్పిన్నర్ అజాజ్ పటేల్ చరిత్ర సృష్టించాడు. ఓ ఇన్నింగ్స్​లో పదివికెట్లు పడగొట్టిన మూడో క్రికెటర్​గా నిలిచాడు.

కాగా, మిచెల్ స్టార్క్.. యాషెస్​ సిరీస్​లో భాగంగా అటు బంతితో ఇటు బ్యాట్​తో రాణిస్తున్నాడు. ఇంగ్లాండ్​పై ఆసీస్​ టెస్టు సిరీస్​ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇదీ చదవండి:

ఐసీసీ ప్లేయర్​ 'ఆఫ్​ ది మంత్​' రేసులో వీరే!

'ప్లేయర్​ ఆఫ్ ది మంత్'​ రేసులో పాక్​​ హిట్టర్​

ఐసీసీ 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్'​గా వార్నర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.