ETV Bharat / sports

ICC Mens Ranking : కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్​ సాధించిన గిల్.. సూర్య అగ్రస్థానం పదిలం.. కోహ్లీ, రోహిత్ ర్యాంకు ఎంతంటే?​ ​ - విరాట్ కోహ్లీ టీ20 ర్యాంకింగ్

ICC Mens Ranking : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం పురుషుల ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్​లో వన్డేల్లో టీమ్ఇండియా యువ సంచలనం శుభ్​మన్ గిల్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇంకా ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారంటే..

ICC Mens Ranking
ICC Mens Ranking
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 3:51 PM IST

Updated : Aug 23, 2023, 4:19 PM IST

ICC Mens Ranking : ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా యంగ్​ బ్యాటర్ శుభ్​మన్ గిల్ 743 పాయింట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజామ్​ 880 పాయింట్లతో ఆగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక భారత్ తరఫున టాప్​ 10లో గిల్​తో పాటు విరాట్ కోహ్లీ ఒక్కడే.. 705 పాయిట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 693 పాయింట్లతో 11వ స్థానంలో కొనసాగుతున్నాడు.

ICC Odi Bowler Ranking : బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హజెల్​వుడ్ 705 పాయింట్లతో టాప్​లో ఉన్నాడు. ఈ లిస్ట్​లో టీమ్ఇండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ 670 పాయింట్లతో ఐదు, స్పిన్నర్ కుల్​దీప్ యాదవ్ 622 పాయింట్లతో పది స్థానాల్లో కొనసాగుతున్నారు.

ICC Mens T20 Rankings Batsman : టీ20 ర్యాంకింగ్స్​లో టీమ్​ఇండియా క్రికెటర్​ సూర్యకుమార్ యాదవ్ 889 పాయింట్లతో తన ఆగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. భారత్ నుంచి సూర్య ఒక్కడే టాప్ 10లో ఉన్నాడు. ఇక ఐర్లాండ్​తో రెండో టీ20లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్ 397 పాయింట్లతో.. 143 నుంచి 87వ స్థానానికి చేరుకున్నాడు.

ICC Men's T20 Ranking Bowler : టీ20 బౌలింగ్​ విభాగంలో అఫ్గానిస్థాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ 713 పాయింట్లతో టాప్​లో ఉన్నాడు. ఇక ఐర్లాండ్ పర్యటనతో కమ్​బ్యాక్ ఇచ్చిన టీమ్ఇండియా పేస్ బౌలర్ జస్​ప్రీత్ బుమ్రా 415 పాయింట్లతో 84వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక స్పిన్నర్ రవి బిష్ణోయ్ 456 పాయింట్లతో 65 ప్లేస్​లో కొనసాగుతున్నాడు.

ICC Test Batting Ranking : టెస్టు బ్యాటింగ్ ర్యాకింగ్స్​లో న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 883 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. కాగా టీమ్ఇండియా నుంచి రోహిత్ శర్మ ఒక్కడే టాప్ 10 లిస్ట్​లో ఉన్నాడు. రోహిత్ 759 పాయింట్లతో 10వ స్థానంలో కొనసాగుతున్నాడు.

ICC Test Ranking Latest : టెస్టు ర్యాంకింగ్స్​లో బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ 897 పాయింట్లతో టాప్​ పొజిషన్​లో ఉన్నాడు. ఆల్​రౌండర్ల లిస్ట్​లో రవీంద్ర జడేజా 455 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ICC T20 Rankings : నెం.1 స్థానంలోనే సూర్య భాయ్​

టెస్ట్ ర్యాంకింగ్స్​లో రోహిత్​ టాప్​.. జైస్వాల్​ కూడా ఆ పొజిషన్​లోకి..

Last Updated : Aug 23, 2023, 4:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.