ETV Bharat / sports

ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్​లో విఫలం.. సచిన్​కు కోహ్లీ ఫోన్

గతంలో ఇంగ్లాండ్​ పర్యటన గురించి కెప్టెన్ కోహ్లీ మాట్లాడాడు. పరుగుల చేయలేకపోయిన ఆ సిరీస్ తర్వాత సచిన్​ సలహాలు తీసుకుని గాడిలో పడినట్లు వెల్లడించాడు. పరుగులు చేయకపోవడం వల్ల కొంతకాలం అంతా శూన్యంలా అనిపించిందని చెప్పాడు.

author img

By

Published : Aug 5, 2021, 5:31 AM IST

virat kohli, sachin tendulkar
విరాట్ కోహ్లీ, సచిన్​ తెందుల్కర్

టీమ్ఇండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. 2014 ఇంగ్లాండ్​ పర్యటనలో బ్యాట్స్​మన్​గా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు. నాటి ఒడుదొడుకులను ఎలా అధిగమించాడనే విషయాలను ఇప్పుడు వివరించాడు. దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​ తనకు కీలక సూచనలు చేశారని వెల్లడించాడు.

ఇంగ్లాండ్​తో ఐదు టెస్టుల సిరీస్​లో వరుసగా 1, 8, 25, 0, 39, 28, 0, 7, 6, 20 పరుగులు చేశాడు కోహ్లీ. పది ఇన్నింగ్స్​ల్లో 13.40 సగటుతో 134 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తర్వాత ఆసీస్​తో టెస్టు సిరీస్​లో తిరిగి ఫామ్​ అందుకున్నాడు విరాట్. అందులో మొత్తంగా 692 పరుగులు సాధించాడు. ఇదంతా సచిన్​ సలహాలతోనే సాధ్యమైందని తెలిపాడు కోహ్లీ. తెందుల్కర్​ సూచనలతోనే మిచెల్ జాన్సన్​ వంటి ఫాస్ట్​ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నట్లు పేర్కొన్నాడు.

"ఆస్ట్రేలియాతో సిరీస్​కు ముందు ప్రతి విదేశీ పర్యటన నాకు కఠినంగానే అనిపించేది. నిజం చెప్పాలంటే ఇంజనీరింగ్​ పరీక్ష రాసినట్లే భావన కలిగేది. ఎలా నన్ను నేను నిరూపించుకోవాలి అని బాధపడేవాణ్ని. అప్పుడు నేను ఒంటరిలా అనిపించాను. నాకు చెప్పేవాళ్లు ఎవరూ లేరని గ్రహించాను. కష్టపడి పనిచేస్తేనే నేను తిరిగి గాడిలో పడతానని అనుకున్నాను. ముంబయికి వెళ్లి సాధన మొదలెట్టాను. అక్కడ సచిన్​కు ఫోన్ చేసి​ సలహాలు తీసుకున్నాను. ఆయన సూచనలు నాకెంతో ఉపయోగపడ్డాయి" అని కోహ్లీ చెప్పాడు.

ఇదీ చదవండి: Ind vs Eng: భారత బౌలర్లు అదుర్స్.. ఇంగ్లాండ్​ ఆలౌట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.