ETV Bharat / sports

'టీమ్​ఇండియాకు సారథ్యం వహించడం గర్వంగా భావిస్తాను' - క్రీడా వార్తలు తాజా

KL Rahul on Test Captaincy: టీమ్​ఇండియాకు కెప్టెన్​గా బాధ్యతలు చేపట్టడాన్ని గర్వంగా భావిస్తానన్నాడు కేఎల్​ రాహుల్​. మరోవైపు మాజీ కెప్టెన్ విరాట్​ కోహ్లీపైన కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రాహుల్​. టీమ్​ఇండియా అద్భుతాలను సాధించొచ్చు అనే నమ్మకాన్ని జట్టు సభ్యులకు విరాట్​ కలిగించాడని చెప్పుకొచ్చాడు.

kl rahul
కేఎల్​ రాహుల్ టీమ్​ఇండియా
author img

By

Published : Jan 18, 2022, 6:18 PM IST

KL Rahul on Test Captaincy: టీమ్​ఇండియా టెస్ట్​ జట్టు సారథిగా విరాట్​ కోహ్లీ తప్పుకున్న నేపథ్యంలో కెప్టెన్సీ రేసులో రోహిత్​ శర్మ, పంత్​, బూమ్రాతో కేఎల్​ రాహుల్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ విషయంపై స్పందించిన కేఎల్​ రాహుల్..​ తనకు టెస్ట్​ కెప్టెన్సీ అప్పగిస్తే అది చాలా పెద్ద బాధ్యతగా భావిస్తానని పేర్కొన్నాడు.

"టెస్టు జట్టు సారథిగా రేసులో ఉన్నట్లు తెలిసే వరకు నాకు అసలు కెప్టెన్సీపై ఆలోచనే లేదు. ఇదివరకే నేను జోహన్నెస్​బర్గ్​లో జరిగిన టెస్టుకు అనుకోకుండా సారథ్యం వహించే అవకాశం వచ్చింది. మ్యాచ్​ ఫలితం పక్కన పెడితే.. అది నాకు చాలా ప్రత్యేకం. టీమ్​ఇండియాకు కెప్టెన్సీ చేయడం గర్వంగా భావిస్తాను."

-కేఎల్​ రాహుల్

ఆ నమ్మకాన్ని కోహ్లీ కలిగించాడు..

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కేఎల్​ రాహుల్. కోహ్లీ సారథ్యంలో టీమ్​ఇండియా అసాధారణ ప్రదర్శన చేసిందన్నాడు. విదేశీ గడ్డపై జరిగే సిరీస్​లో జట్టుకు విజయాన్ని అందించడం సహా జట్టు స్థాయిని పెంచాడని తెలిపాడు. విరాట్​ నాయకత్వం చాలా ప్రత్యేకమైనదని.. జట్టు సభ్యులకు అద్భుతాలు సాధించొచ్చనే నమ్మకాన్ని కలిగించాడని తెలిపాడు.

ప్రస్తుతం కేఎల్​ రాహుల్​ దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్​కు సారథిగా వ్యవహరించనున్నాడు.

ఇదీ చూడండి : సఫారీలతో సమరానికి టీమ్​ఇండియా సై .. అందరి కళ్లూ కోహ్లీపైనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.