How to Follow Indian Cricket Team in WhatsApp: క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఏ మ్యాచ్ జరిగినా టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోయి మరీ చూస్తారు. అంతే కాకుండా.. టీమ్‌లో మార్పులు, తెర వెనుక ఏం జరుగుతుంది. ప్లేయర్స్ ఏం చేస్తారు..? వంటి విషయాలను తెలుసుకోవడానికి కూడా ఆసక్తి చూపిస్తారు. అలాంటి అభిమానుల కోసం ఓ గుడ్‌న్యూస్.
అది ఏంటంటే.. టీమిండియా ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్ లోకి వచ్చింది. తాజా అప్‌డేట్స్, ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు, తెర వెనుక జరిగే కంటెంట్‌ను తెలుసుకోవాలనుకుంటే ఇకపై వాట్సాప్‌ను ఫాలో అయితే సరిపోతుంది. అయితే ఈ వాట్సాప్ ఛానెల్స్ ద్వారా టీమిండియా న్యూస్ తెలుసుకునే అవకాశం ఉంటుంది తప్ప టీమ్ సభ్యులతో చాట్ చేసే అవకాశం మాత్రం ఉండదని ఫ్యాన్స్ గుర్తుంచుకోవాలి.
ICC World Cup Team India Jersey : ప్రపంచకప్‌నకు టీమ్ఇండియా జెర్సీ రెడీ.. అందులో అదే స్పెషల్!
అసలు వాట్సాప్ ఛానెల్ అంటే ఏమిటి?:
What is WhatsApp Channel: ఇన్నాళ్లూ వాట్సప్‌ను పరస్పర కమ్యూనికేషన్ కోసం మాత్రమే వాడేవాళ్లం. ఆ తర్వాత గ్రూప్స్ వచ్చాయి. ఇప్పుడు కొత్తగా ఛానెల్స్. ఈ ఫీచర్ ద్వారా మీకు నచ్చిన వ్యక్తులు, సంస్థలను ఫాలో అయ్యి వాట్సాప్‌లోనే ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు. అచ్చం ట్విటర్, ఇన్‌స్టాలో ఎలాగైతే మనకు నచ్చిన వారిని ఫాలో అవుతున్నామో అలా అన్నమాట. కావాలనుకుంటే ఈ అప్‌డేట్‌ను ఇతరులతో పంచుకోవచ్చు. మీరు ఫాలో అయినంత మాత్రానా మీ ఫోన్ నంబర్ ఎవరికీ కనిపించదు.
ఇప్పటికే ఇండియన్ టీమ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లలో ఉంది. ఇప్పుడు వాట్సాప్‌లోకి రావడంతో ఫ్యాన్స్ మస్త్ ఖుష్ అవుతున్నారు. వాట్సాప్ ఛానెల్ ద్వారా ఇండియన్ క్రికెట్ టీమ్ అభిమానులకు మరింత చేరువైందని చెప్పొచ్చు. ఈ ఛానెల్‌ను ఫాలో అయ్యే అభిమానులకు ఎప్పటికప్పుడు టీమ్ కు సంబంధించిన న్యూస్ అందుతుంది. నేరుగా వాళ్ల ఫోన్‌కే ఈ సమాచారం రావడాన్ని అభిమానులు ఎంజాయ్ చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. మెన్ ఇన్ బ్లూకి సంబంధించిన ప్రతి న్యూస్ వాట్సాప్ లో షేర్ చేయనుండటంతో టీమ్ వార్తల కోసం మరో చోటికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. వరల్డ్ కప్‌కు ముందు ఇండియన్ టీమ్ ఫ్యాన్స్ కు ఈ వాట్సాప్ ఛానెల్స్ గుడ్ న్యూస్ అందించాయి.
-
🚨 #TeamIndia is now on WhatsApp Channels! 📱
— BCCI (@BCCI) September 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Stay connected for the latest updates 🗞️, exclusive photos 📸 and behind the scenes content 🎥🙌🏻
Follow us here 🔽 https://t.co/3U8Fo9llOT pic.twitter.com/o5zs25iHka
">🚨 #TeamIndia is now on WhatsApp Channels! 📱
— BCCI (@BCCI) September 14, 2023
Stay connected for the latest updates 🗞️, exclusive photos 📸 and behind the scenes content 🎥🙌🏻
Follow us here 🔽 https://t.co/3U8Fo9llOT pic.twitter.com/o5zs25iHka🚨 #TeamIndia is now on WhatsApp Channels! 📱
— BCCI (@BCCI) September 14, 2023
Stay connected for the latest updates 🗞️, exclusive photos 📸 and behind the scenes content 🎥🙌🏻
Follow us here 🔽 https://t.co/3U8Fo9llOT pic.twitter.com/o5zs25iHka
అయితే ఈ వాట్సాప్ ఛానెల్‌ను ఫాలో అవ్వడానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- ముందుగా మీ వాట్సాప్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి.
- ఇప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ని తెరవండి.
- దీని తర్వాత మీరు చాట్స్ ట్యాబ్ ప్రక్కన ఉన్న అప్‌డేట్ బటన్‌పై నొక్కండి.
- స్క్రీన్ మీద మీ స్నేహితుల స్టేటస్ అప్‌డేట్‌లు, ఛానెల్‌లను గమనించవచ్చు.
- అనంతరం ఛానెల్ కాలమ్‌లో Find Channel బటన్‌పై క్లిక్ చేసి.. ఇండియన్ క్రికెట్ టీమ్ అని సెర్చ్ చేయండి.
- ఆ తర్వాత Follow బటన్‌పై నొక్కండి.
- అనంతరం మీరు భారత జట్టు గురించిన అన్ని తాజా అప్‌డేట్‌లను పొందవచ్చు.
- ఇప్పటికే ఇండియన్ క్రికెట్ వాట్సాప్ ఛానెల్‌ను 5.2M ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు.
ICC World Cup Anthem 2023 : వరల్డ్ కప్ యాంథమ్ వచ్చేసిందోచ్.. ఇక అందరూ అంటారు 'దిల్ జషన్ బోలే'