ETV Bharat / sports

రుతురాజ్​ వీర విధ్వంసం.. ఒకే ఓవర్​లో ఏడు సిక్సులు.. 'విజయ్ హజారే'లో డబుల్ సెంచరీ - రుతురాజ్​ గైక్వాడ్ సంచలన రికార్డు

క్రికెటర్​ రుతురాజ్​ గైక్వాడ్ సంచలన రికార్డు నమోదు చేశాడు. ఓవర్​లో ఏకంగా 7 సిక్సులు కొట్టి సంచలనం సృష్టించాడు. విజయ్​ హజారే ట్రోఫీ క్వార్టర్​ ఫైనల్​ మ్యాచ్​.. ఈ అరుదైన ప్రదర్శనకు వేదికైంది.

Ruturaj Gaikwad
రుతురాజ్​ గైక్వాడ్
author img

By

Published : Nov 28, 2022, 1:38 PM IST

Updated : Nov 28, 2022, 4:23 PM IST

టీమ్ఇండియా యువ ఓపెనర్​ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ ట్రోర్నీ విజయ్​ హజారే ట్రోఫీ రెండో క్వార్టర్​ ఫైనల్​ మ్యాచ్​లో సంచలన రికార్డు నమోదు చేశాడు. ఏకంగా ఓవర్​లో 7 సిక్సులు బాది సంచలనం సృష్టించాడు.

ఒకే ఓవర్‌లో 43 పరుగులు.. రెండో క్వార్టర్​ ఫైనల్​ మ్యాచ్​లో భాగంగా మహారాష్ట్ర ఉత్తర్​ప్రదేశ్​​ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్​లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న రుతురాజ్.. ఇన్నింగ్స్​ 49వ ఓవర్​లో యూపీ బౌలర్​ శివ సింగ్​ వేసిన బౌలింగ్​లో.. వరుసగా ఏకంగా 7 సిక్స్​లు బాది.. డబుల్​ సెంచరీ పూర్తి చేశాడు.

అయితే వరుసగా నాలుగు బంతులను రుతురాజ్​ సిక్సర్లుగా మలచగా.. ఒత్తిడికి గురైన బౌలర్​ ఐదో బంతిని నోబాల్ వేశాడు. దీంతో మరో బాల్ వేయాల్సి వచ్చింది. ఇలా వేసిన బంతిని వేసినట్లు.. స్టాండ్​లోకి పంపించాడు రుతురాజ్. అలా ఈ ఓవర్‌లో 43 పరుగులు వచ్చాయి. మొత్తంగా 159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సులతో మెుత్తం 220 పరుగులు చేశాడు. దీంతో మహారాష్ట్ర ఐదు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది.

ఒకే ఓవర్​లో 8 సిక్స్​లు.. ఒక ఓవర్​లో అత్యధిక సిక్సులు కొట్టిన రికార్డు న్యూజిలాండ్ లిస్ట్-ఏ క్రికెటర్ లీ జెర్మోన్ పేరిట ఉంది. 1990లో షెల్ ట్రోఫీ మ్యాచ్​లో భాగంగా అతడు ఒకే ఓవర్లో ఎనిమిది సిక్సులు కొట్టాడు. అయితే, ఆ మ్యాచ్​లో ప్రత్యర్థి జట్టు.. కావాలనే అదనపు పరుగులు ఇచ్చింది. బ్యాటర్.. సిక్సులు, ఫోర్లు కొట్టేలా బంతులు విసిరింది.

అనేక వైడ్లు, నోబాల్స్ కలిపి... ఒకే ఓవర్​లో మొత్తం 77 పరుగులు సమర్పించుకుంది. ఇక ఆరు బంతుల్లో ఆరు సిక్స్​లు బాదిన క్రికెటర్లలో సర్​ గార్​ఫీల్డ్​ సోబర్స్​(వెస్టిండీస్​), రవిశాస్త్రి(టీమ్​ఇండియా), గిబ్స్​(దక్షిణాఫ్రికా), యువరాజ్ సింగ్​(టీమ్​ఇండియా), రాస్ వైట్లీ(ఇంగ్లాండ్​), హజ్రతుల్లా(అప్ఘానిస్థాన్​), లియో కార్టర్​(న్యూజిలాండ్​), కీరన్ పొలార్డ్​(వెస్టిండీస్​), తిసారా పెరెరా(లంక) ఉన్నారు.
ఇదీ చదవండి:'వన్డే ప్రపంచకప్‌ గురించి అస్సలు ఆలోచించడం లేదు.. వర్షాలు చికాకు తెప్పిస్తున్నాయి'

Last Updated : Nov 28, 2022, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.