ETV Bharat / sports

Highest Team Score In Asia Cup : మినీ టోర్నీలో రికార్డులు.. ఆసియా క‌ప్​లో అత్యధిక స్కోరు ఆ జట్టుదే..

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2023, 7:46 AM IST

Highest Team Score In Asia Cup : ఆసియా కప్​ వేదికగా ఎన్నో రికార్డులు నెలకొన్న సందర్భాలున్నాయి. అయితే క్రికెట్​ లవర్స్​ ఎంతగానో ఇష్టపడే ఈ మినీ టోర్నీలో ఇప్ప‌టి దాకా భారీ స్కోర్లు న‌మోదు చేసిన జ‌ట్లు కూడా ఉన్నాయి. ప్లేయర్ల కృషితో పాటు జట్టు కీలక నిర్ణయాల వల్ల అటువంటి భారీ స్కోర్స్​ నమోదయ్యాయి. ఆ వివరాలు మీ కోసం..

Highest Team Score In Asia Cup
Highest Team Score In Asia Cup

Highest Team Score In Asia Cup : ప్రతిష్టాత్మక ఆసియా కప్​ వేదికగా ఇండియా, పాకిస్థాన్​తో పాటు మ‌రో 4 దేశాలు పోటా పోటీగా తలపడుతున్నాయి. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆసియా క‌ప్ ఫీవ‌ర్ నడుస్తోంది. ఆగస్ట్​ 30న మొదలై సెప్టెంబ‌రు 17 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ఈ మినీ టోర్నీలో మున్ముందు కీల‌క మ్యాచ్​లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్రమంలో భారీ స్కోర్లు సాధించి ప్ర‌త్యర్థుల‌ను మ‌ట్టి క‌రిపించాల‌ని ఆయా జ‌ట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. మ్యాచులు గెల‌వాలన్నా.. విజేతగా నిలిచి క‌ప్పును ముద్దాడాల‌న్నా.. మంచి స్కోరు చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ నేప‌థ్యంలో ఆసియా క‌ప్ చ‌రిత్ర‌లో (వ‌న్డే ఫార్మాట్ ) ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక స్కోరు సాధించిన జట్లు గురించి ఓ సారి చూద్దామా..

  1. పాకిస్థాన్‌
    ఆసియా క‌ప్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక స్కోరు కొట్టిన జ‌ట్టుగా పాకిస్థాన్​ మొద‌టి స్థానంలో నిలిచింది. 2010లో శ్రీ‌లంక వేదికగా జ‌రిగిన టోర్నీలో బంగ్లాదేశ్​పై పాక్.. 7 వికెట్ల న‌ష్టానికి 387 ప‌రుగులు సాధించింది. ఆ మ్యాచ్​లో పాక్ ఆల్ రౌండ‌ర్ షాహిద్ ఆఫ్రిది చెల‌రేగి ఆడ‌టం వల్ల ఆ స్కోరు నమోదైంది. ఆ మ్యాచ్ లో ఆఫ్రిది 60 బంతుల్లో 124 ప‌రుగులు కొట్టాడు. ఫ‌లితంగా పాక్ ఈ రికార్డు న‌మోదు చేసింది.
  2. ఇండియా
    2008 లో పాకిస్థాన్ వేదికగా జరిగిన ఆసియా కప్​ టోర్నీలో హాంగ్​కాంగ్ జ‌ట్టుతో తలపడ్డ టీమ్​ఇండియా.. ఆ మ్యాచ్​లో 374/4 ర‌న్స్ కొట్టింది. కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ, సురేశ్ రైనా.. ఈ మ్యాచ్​లో మంచి భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ఇక ఇద్ద‌రూ శ‌త‌కాలు బాద‌డం వల్ల టీమ్​ఇండియా భారీ స్కోరు చేసింది.
  3. శ్రీ‌లంక‌
    2008 ఆసియా క‌ప్ ఎడిష‌న్​లో బంగ్లాదేశ్​తో త‌ల‌ప‌డిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. 9 వికెట్ల న‌ష్టానికి 357 ప‌రుగులు చేసింది. ఆ మ్యాచ్​లో లంక బ్యాట‌ర్లు స‌మ‌ష్టిగా రాణించ‌డం వల్ల రికార్డు స్థాయిలో ర‌న్స్ నమోదైంది.
  4. పాకిస్థాన్
    2004లో శ్రీ‌లంక‌ వేదికగా జ‌రిగిన ఆసియా క‌ప్ టోర్నీలో హాంగ్​కాంగ్ జట్టుపై పాక్.. త‌న రెండో అత్య‌ధిక స్కోరును న‌మోదు చేసింది. కొలంబోలో జ‌రిగిన ఆ మ్యాచ్​లో పాక్​.. 343/5 ర‌న్స్ చేసింది. పాక్ జట్టు బ్యాట‌ర్లు యూనిస్ ఖాన్‌, షోయ‌బ్ మాలిక్ మంచి భాగ‌స్వామ్యంతో ఆ స్కోరు చేయ‌గ‌లిగింది.
  5. పాకిస్థాన్
    ప్రస్తుత ఆసియా క‌ప్ టోర్నీ ప్రారంభ మ్యాచ్​లో పాకిస్థాన్​ జట్టు చెల‌రేగి ఆడింది. నేపాల్​తో ఆడిన తొలి మ్యాచ్​లో ఆ జట్టుపై భారీ స్కోర్ చేసింది. ఇక పాక్ కెప్టెన్ బాబ‌ర్ అజామ్ తనదైన శైలిలో ఆడి 151 ప‌రుగులు సాధించగా.. మ‌రో బ్యాట‌ర్ ఇఫ్తిక‌ర్ అహ్మ‌ద్ 109 ప‌రుగులు చేయ‌డం వల్ల జ‌ట్టు మొత్తం స్కోరు 342/6 కు చేరింది. ఇక ఈ మ్యాచ్​లో పాక్​దే పై చేయిగా నిలిచింది.

Ind vs Pak Top 5 Wicket Takers : ఇండోపాక్ మ్యాచ్​ల్లో అత్యధిక వికెట్ల వీరులు వీళ్లే.. లిస్ట్​లో కుంబ్లే ప్లేస్ ఎంతంటే

Virat Kohli Asia Cup 2023 : ఇప్పటివరకు ఓ లెక్క.. ఇకపై ఓ లెక్క.. ఆ టోర్నీల్లో విరాట్ సెన్సేషనల్​ రికార్డులు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.