ETV Bharat / sports

టెస్టు​ కెరీర్​పై భువనేశ్వర్ కుమార్ క్లారిటీ

టెస్టు క్రికెట్​ నుంచి తాను తప్పుకుంటున్నట్లు వస్తోన్న వార్తలను టీమ్​ఇండియా బౌలర్​ భువనేశ్వర్​ కొట్టిపారేశాడు​. జట్టు ఎంపికతో సంబంధం లేకుండా మూడు ఫార్మాట్లు ఆడేందుకు ఎప్పుడూ సిద్ధమేనని అన్నాడు.

author img

By

Published : May 15, 2021, 8:48 PM IST

Bhuvneshwar Kumar
భువీ

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​, ఇంగ్లాండ్​ సిరీస్​ కోసం బీసీసీఐ, ఇటీవల జంబో జట్టును ప్రకటించింది. ఇందులో భువనేశ్వర్​ కుమార్ లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో అతడు టెస్టుల్లో ఆడటానికి సుముఖంగా లేడని జోరుగా ప్రచారం సాగింది. ఇప్పుడు ఈ విషయమై స్పందించిన భువీ.. ఆ వార్తలను ఖండించాడు.

"నేను టెస్టు క్రికెట్​ ఆడటానికి ఇష్టంగా లేనంటూ కథనాలు వస్తున్నాయి. నేనొకటి స్పష్టం చేయాలనుకుంటున్నాను. జట్టు ఎంపికతో సంబంధం లేకుండా మూడు ఫార్మాట్లకు ఆడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఇదే పద్ధతిని ఇకపైనా కొనసాగిస్తాను. మీకొక సూచన.. దయచేసి విశ్వసనీయ వర్గాల ఆధారంగా కథనాలు రాయొద్దు" అని ట్వీట్​ చేశాడు.

  • There have been articles about me not wanting to play Test cricket. Just to clarify, I have always prepared myself for all three formats irrespective of the team selection and will continue to do the same.
    Suggestion - please don’t write your assumptions based on “sources”!

    — Bhuvneshwar Kumar (@BhuviOfficial) May 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: భువనేశ్వర్​కు ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్​' అవార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.