Nayanthara Dhanush Issue : కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార, హీరో ధనుష్‌పై చేసిన విమర్శలు ప్రస్తుతం సినీవర్గాల్లో హాట్ టాపిగ్గా మారాయి. ఈ నేపథ్యంలో నయన్ భర్త విఘ్నేశ్ శివన్ కూడా ధనుష్‌ను ఉద్దేశిస్తూ రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన కొద్ది సేపటికీ ఇది ఇంటర్నెట్లో బాగా వైరలైంది. అయితే విఘ్నేశ్ ఈ పోస్ట్‌ను తొలగించారు.
'ద్వేషాన్ని కాదు, ప్రేమను పంచండి. మీ కోసం పడి చచ్చిపోయే అమాయక అభిమానుల కోసమైనా మీరు మారండి. మనుషులు మారాలని, ఎదుటివారి ఆనందాల్లో కూడా సంతోషం వెతుక్కోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను' అని విఘ్నేశ్ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. కానీ, ఆయన దీనిని తొలగించడం గమనార్హం. అలాగే ఈ పోస్టు ఎందుకు డిలీట్ చేశారో కూడా తెలియదు.
ఇదీ జరిగింది
విఘ్నేశ్ శివన్ డైరెక్షన్లో నయనతార హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం 'నానుమ్ రౌడీ దానే'. ఈ సినిమాకు ధనుష్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా సమయంలోనే విఘ్నేశ్ - నయన్ ప్రేమ మొదలైంది. పెద్దల అంగీకారంతో 2022లో పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ నయన్ కెరీర్, ప్రేమ, పెళ్లి ఇలా పలు అంశాలతో కూడిన ఓ డాక్యుమెంటరీని సిద్ధం చేసింది.
'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' పేరుతో రూపొందిన ఈ డాక్యుమెంటరీలో తమ జీవితంలో ఎంతో ముఖ్యమైన 'నానుమ్ రౌడీ దానే' వీడియోలు, పాటలను ఇందులో చూపించాలని ఈ జోడీ భావించింది. అయితే దానికి ధనుష్ అంగీకరించలేదు. ఇటీవల డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదల కాగా, అందులో సినిమాకు సంబంధించిన మూడు సెకన్ల ఫుటేజ్ వాడుకోవడం వల్ల ధనుష్ లీగల్ నోటీసు పంపించారు.
నష్ట పరిహారం కింద రూ.10 కోట్లు డిమాండ్ చేశారు. దీంతో ఆయనపై నయనతార విమర్శలు చేశారు. డబ్బు డిమాండ్ చేయడం విచారకరమని, ఇక్కడే అతడి వ్యక్తిత్వం ఎలాంటిదన్నది తెలిసిపోతుందన్నారు. ఈ వివాదానికి కారణమైన వీడియో క్లిప్‌ను విఘ్నేశ్ శివన్ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు. 'దీని కోసమే రూ.10 కోట్లు డిమాండ్ చేశారు. దీనిని మీరు ఇక్కడ ఉచితంగా చూడొచ్చు' అని రాసుకొచ్చారు.
This is the clip Nayanthara mentioned, worth 10 crores#Nayanthara #Dhanush pic.twitter.com/IR7y8qzVgk
— Dhivya Padmanaban (@dhivya_pad5) November 16, 2024
హీరో ధనుశ్‌పై నయనతార తీవ్ర విమర్శలు - బహిరంగ లేఖ విడుదల చేసిన లేడీ సూపర్ స్టార్
భర్తను అన్‌ఫాలో చేసి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నయన్ - అసలేం జరిగిందంటే?