ETV Bharat / sports

పాక్​పై ఇంగ్లాండ్ సిరీస్​ విన్​- విండీస్ చేతిలో ఆసీస్​ చిత్తు

ఇంగ్లాండ్​-పాకిస్థాన్(England vs Pakisthan)​ మధ్య జరిగిన రెండో వన్డేలో స్టోక్స్​ సేన విజయకేతనం ఎగురవేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్​ను 2-0తో కైవసం చేసుకుంది ఇంగ్లాండ్. విండీస్-ఆసీస్(West Windies vs Australia) మధ్య జరిగిన మరో టీ 20 మ్యాచ్​లో కరీబియన్​ జట్టు విజయదుందుంభి మోగించింది. ఐదు టీ20ల సిరీస్​లో 2-0తో ముందంజ వేసింది.

England vs Pakistan
ఇంగ్లాండ్ vs పాకిస్థాన్​
author img

By

Published : Jul 11, 2021, 10:36 AM IST

లార్డ్స్​ వేదికగా పాకిస్థాన్​తో జరిగిన రెండో వన్డేలో (England vs Pakisthan) ఆతిథ్య ఇంగ్లాండ్​ జట్టు ఘన విజయం సాధించింది. పాకిస్థాన్​పై 52 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో మూడు వన్డేల సిరీస్​ను 2-0తో కైవసం చేసుకుంది స్టోక్స్​ సేన. నామమాత్రమైన మూడో మ్యాచ్​ మంగళవారం బర్మింగ్​హామ్​ వేదికగా జరగనుంది.

47 ఓవర్లకు కుదించిన ఆటలో తొలుత బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్​ 45.2 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్​ ఫిల్​ సాల్ట్​(54 బంతుల్లో 60), జేమ్స్​ విన్స్(52 బంతుల్లో 56 పరుగులు), లూయిస్​ గ్రెగోరీ(47 బంతుల్లో 40 పరుగులు) రాణించారు. పాకిస్థాన్​ బౌలర్లలో హసన్​ అలీ 5 వికెట్లతో మెరిశాడు.

అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్థాన్​ తడబడింది. 41 ఓవర్లలో 195 పరుగులకు ఆలౌటైంది. సౌద్​ షకీల్(77 బంతుల్లో 56) మినహా మిగతా బ్యాట్స్​మెన్​ విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లు సమష్టిగా రాణించారు. గ్రెగోరీ 3, సకిబ్​ మహమూద్​, ఓవర్టెన్, మట్ పార్కిన్సన్​ తలో రెండు వికెట్లతో మెరిశారు.

ఇదీ చదవండి: ఫ్యాన్స్​తో క్రికెటర్​ కొట్లాట.. కేసు నమోదు!

ఆసీస్ చిత్తు..

గ్రాస్ ఐలెట్ వేదికగా ఆస్ట్రేలియాతో (West Windies vs Australia) జరిగిన రెండో టీ20లో ఆతిథ్య విండీస్​ విజయకేతనం ఎగురవేసింది. దీంతో ఐదు టీ20ల సిరీస్​లో 2-0తో ముందంజ వేసింది కరీబియన్​ జట్టు. తొలుత బ్యాటింగ్​కు దిగిన విండీస్​ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆల్​రౌండర్​ హెట్​మేయర్​(36 బంతుల్లో 61 పరుగులు), ఆండ్రూ రస్సెల్​(8 బంతుల్లో 24 పరుగులు) విధ్వంసం సృష్టించారు. డ్రేన్ బ్రేవో(34 బంతుల్లో 47 పరుగులు), సిమ్మన్స్​(21 బంతుల్లో 30 పరుగులు) ఫర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్​వుడ్​, అగర్​, మిచెల్ మార్ష్​ తలో వికెట్​ తీసుకున్నారు.

లక్ష్య ఛేదనలో ఫించ్ సేన ఘోరంగా విఫలమైంది. 19.2 ఓవర్లలో 140 పరుగులకే చాప చుట్టేసింది. మిచెల్​ మార్ష్​(42 బంతుల్లో 54 పరుగులు) ఒక్కడే ఆకట్టుకున్నాడు. కెప్టెన్ ఫించ్​ 6 పరుగులకే వెనుదిరిగగా.. మరో ఓపెనర్​ మాథ్యూ వేడ్​ డకౌటయ్యాడు. హైడేన్​ వాల్ష్​ 3, కాట్రెల్​ 2 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. తదుపరి మ్యాచ్​ మంగళవారం జరగనుంది.

ఇదీ చదవండి: లంక క్రికెటర్​కు కరోనా.. సిరీస్​పై అనుమానాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.