ETV Bharat / sports

'హార్దిక్​ గాయంపై ఆందోళన అవసరం లేదు'

పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో గాయపడిన టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్యా(Hardik Pandya News) న్యూజిలాండ్​తో మ్యాచ్​కు అందుబాటులో ఉండనున్నాడు . అతని భుజానికి అయిన గాయం చిన్నదేనని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

hardik pandya
హార్దిక్ పాండ్య
author img

By

Published : Oct 26, 2021, 3:09 PM IST

టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్యా(Hardik Pandya News) భుజానికి తగిలిన గాయం తీవ్రమైంది కాదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో అక్టోబరు 31న న్యూజిలాండ్​తో జరగనున్న మ్యాచ్​కు హార్దిక్​ అందుబాటులో ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

టీ20 ప్రపంచకప్​లో భాగంగా పాకిస్థాన్​తో(ind vs pak match) ఆదివారం(అక్టోబరు 24) జరిగిన మ్యాచ్​లో బ్యాటింగ్​ చేస్తుండగా హార్దిక్ కుడి భుజానికి గాయమైంది. దీంతో పాక్ ఇన్నింగ్స్​లో అతడు ఫీల్డింగ్​కు రాలేదు. అతడి బదులు ఇషాన్ కిషన్ ఫీల్డింగ్ చేశాడు. ఈ మ్యాచ్​లో 8 బంతుల్లో 11 పరుగులు చేశాడు హార్దిక్​.

ముందు జాగ్రత్తగా పాండ్యాను స్కానింగ్​ కోసం పంపించినట్లు బీసీసీఐ వెల్లడించింది. పాండ్యాకు ఎలాంటి సమస్య లేదని, ఫిట్​గానే ఉన్నట్లు పేర్కొంది.

బౌలింగ్ అనుమానమే..

ఈ మ్యాచ్​కు ముందు తన బౌలింగ్​ ఫామ్​పై స్పందించిన హార్దిక్.. రానున్న మ్యాచుల్లో బౌలింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. అందుకోసం నిపుణుల సలహాలు తీసుకుంటానని వెల్లడించాడు. అయితే ప్రస్తుత గాయం కారణంగా అతడు బంతి చేతపట్టడం అనుమానంగా మారింది.

ఇదీ చూడండి: 'కోహ్లీది గొప్ప మనసు.. ఓటమిని హుందాగా అంగీకరించాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.