టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya News) ఫామ్‌పై పలువురు సీనియర్ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(Kapil Dev on Hardik Pandya) కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ బౌలింగ్ చేయకపోవడం వల్ల టీమ్ఇండియాకు ఎలాంటి నష్టం జరగదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
"ఆల్‌రౌండర్ జట్టులో చాలా పెద్ద మార్పులకు కారణం అవుతాడు. హార్దిక్ బౌలింగ్ చేయకపోవడం వల్ల టీమ్ఇండియాకు టీ20 ప్రపంచకప్‌లో పెద్ద నష్టం ఏమీ జరగదు. కానీ, కోహ్లీ ఎంచుకునే బౌలింగ్ ఆప్షన్లలో మార్పు ఉంటుంది. ఆల్‌రౌండర్ బౌలింగ్, బ్యాటింగ్ రెండూ చేయగలిగితే.. కెప్టెన్‌కు బౌలర్లను ఎంచుకోవడం సులభం అవుతుంది."
-కపిల్ దేవ్, టీమ్ఇండియా ఆల్‌రౌండర్.
సచిన్ తెందూల్కర్, సౌరవ్ గంగూలీ బ్యాట్స్‌మెన్ అయినప్పటికీ.. నాలుగులో రెండు ఓవర్లైనా బౌలింగ్ చేసేవారని కపిల్ దేవ్ గుర్తుచేసుకున్నాడు. ప్రస్తుతం హార్దిక్ కనీసం రెండు ఓవర్లు అయినా బౌలింగ్ చేస్తే జట్టుకు బలం చేకూరుతుందని తెలిపాడు.
టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో వార్మప్ మ్యాచ్‌లో భాగంగా హార్దిక్ పాండ్యా ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. మరోవైపు భువనేశ్వర్ కూడా బౌలింగ్ నైపుణ్యం చూపలేకపోయాడు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా బౌలింగ్‌పై మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బుధవారం(అక్టోబర్ 20న) ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది భారత్. అసలు పోరులో భాగంగా అక్టోబర్ 24న పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.
ఇదీ చదవండి: