Hardik Pandya Injury World Cup 2023 : 2023 వన్డే ప్రపంచకప్ భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల టేబుల్లో మొదటి స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య.. తిరిగి టీమ్‌లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పాండ్య వేగంగా కోలుకుంటున్నట్లు సమాచారం. అయితే అంతా బాగుంటే నాకౌట్ స్టేజ్‌లో హార్దిక్ మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Pandya Injury Update : వరల్డ్ కప్‌లో భాగంగా ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యకు గాయం అయింది. తీవ్ర నొప్పతో పూర్తి ఓవర్ వేయకుండానే మైదానం వీడాడు ఈ ఆల్‌రౌండర్. దీంతో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పాండ్య ఓవర్‌ను పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ తర్వాత పాండ్య తిరిగి జట్టులోకి రాలేదు. న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో జరిగిన మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం ఎన్సీఏ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న హార్దిక్.. నొప్పి నుంచి ఉపశమనం పొందినట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ ట్రైనింగ్ కూడా ప్రారంభించినట్లు సమాచారం. నాకౌట్ దశలో నవంబరు 15 నాటికి జట్టులోకి ఎంట్రీ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్య గాయం గురించి స్పందించిన భారత జట్టు బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే.. అతడి రికవరీ గురించి మరో రెండు రోజుల్లో అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాడు.
India vs Sri Lanka World Cup 2023 : ఇదిలా ఉండగా.. ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 100 పరుగులు ఘన విజయం సాధించింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు కేవలం 129 పరుగులకే కుప్పకూలారు. అలా ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమ్ఇండియా.. ఇప్పటికే నాకౌట్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఏడో మ్యాచ్‌లో నవంబర్ 2న శ్రీలకంతో తలపడనుంది. మరోవైపు ఐదు మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక రెండింట్లో విజయం సాధించింది. నాలుగు పాయింట్లతో టేబుల్లో ఐదో స్థానంలో కొనసాగుతోంది.