ETV Bharat / sports

ఆ ఘనత సాధించిన భారత ఏకైక కెప్టెన్​గా హార్దిక్​ పాండ్య - india vs ireland t20

ఐర్లాండ్​తో తొలి టీ20 సందర్భంగా అరుదైన ఘనత సాధించాడు టీమ్​ఇండియా సారథి హార్దిక్ పాండ్య. టీ20ల్లో వికెట్ తీసిన భారత తొలి కెప్టెన్​గా రికార్డులకెక్కాడు.

Hardik Pandya
india vs ireland
author img

By

Published : Jun 27, 2022, 11:23 AM IST

గతరాత్రి ఐర్లాండ్‌తో జరిగిన పోరులో టీమ్‌ఇండియా సునాయాస విజయం సాధించింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని 9.2 ఓవర్లలో ఛేదించి సిరీస్‌లో 1-0తో శుభారంభం చేసింది. అయితే, ఇదే మ్యాచ్‌లో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్సీ చేపట్టిన హార్దిక్‌.. మరోకొత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో టీమ్‌ఇండియా ఎనిమిదో సారథిగా బాధ్యతలు చేపట్టిన అతడు.. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ ఓపెనర్‌ స్టిర్లింగ్‌ (4)ను ఔట్‌ చేయడం ద్వారా వికెట్‌ తీసిన తొలి సారథిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే ఈ ఘనత సాధించాడు.

ఇక వర్షం అంతరాయం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా హ్యారీ టెక్టర్‌ (64 నాటౌట్‌; 33 బంతుల్లో 6x4, 3x6) రాణించాడు. ఛేదనలో దీపక్‌ హుడా(47 నాటౌట్‌; 29 బంతుల్లో 6x4, 2x6), ఇషాన్‌ కిషన్‌ (26; 11 బంతుల్లో 3x4, 2x6) ఓపెనర్లుగా మెరవగా తర్వాత హార్దిక్‌ పాండ్య (24; 12 బంతుల్లో 1x4, 3x6) దంచికొట్టాడు. దీంతో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టింది. మరోవైపు హార్దిక్‌ తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. బంతితో ఆదిలోనే వికెట్‌ తీసి శుభారంభం చేయగా తర్వాత బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపించి టీమ్‌ఇండియాను ముందుండి నడిపించాడు.

మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన అతడు.. "ఒక జట్టుగా విజయంతో ఈ సిరీస్‌ను ఆరంభించడం మాకు గొప్పగా ఉంది. అదెంతో ముఖ్యం కూడా. ఈ మ్యాచ్‌లో ఐర్లాంగ్‌ బాగా ఆడింది. అయితే, మా ప్రధాన బౌలర్లు వారిని అంతకన్నా బాగా కట్టడి చేశారు. అలాగే ఆ జట్టులో హ్యారీ టెక్టర్‌ అద్భుతంగా ఆడాడు. కొన్ని షాట్లు చూడముచ్చటగా ఉన్నాయి. అతడు ఇప్పుడు 22 ఏళ్ల యువకుడే కాబట్టి భవిష్యత్‌తో మరింత రాణిస్తాడు. టెక్టర్‌కు నేను బ్యాట్‌ కూడా బహుమతిగా ఇచ్చా. దీంతో అతడు మరిన్ని సిక్సర్లు కొడతాడని ఆశిస్తున్నా. అలాగే రాబోయే రోజుల్లో భారత టీ20 లీగ్‌లోనూ కాంట్రాక్ట్‌ దక్కించుకుంటాడని అనుకుంటున్నా" అని హార్దిక్‌ చెప్పుకొచ్చాడు.

ఇదీ చూడండి: దీపికనే నా మొదటి క్రష్​.. కానీ నా భార్యను అక్కడ చూడగానే..: హార్దిక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.