Harbhajan singh: దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవని టీమ్‌ఇండియా.. ఈసారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నాడు వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్. దక్షిణాఫ్రికా పర్యటన.. భారత్‌కు బంగారు అవకాశమని అన్నాడు. మరికొద్ది రోజుల్లో భారత జట్టు అక్కడికెళ్లి మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనున్న నేపథ్యంలో స్పిన్ దిగ్గజం యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ప్రస్తుతం సఫారీ జట్టులో ఆటగాళ్లెవరూ మంచి ఫామ్‌లో లేరని, దీంతో అక్కడ విజయాలు సాధించి చరిత్ర సృష్టించాలని భజ్జీ అశాభావం వ్యక్తం చేశాడు.
"టీమ్‌ఇండియాకు ఇది బంగారు అవకాశం. ఎందుకంటే ఇప్పుడు దక్షిణాఫ్రికా జట్టు ఇంతకుముందులా పటిష్ఠంగా లేదు. గత పర్యటనలోనూ ఏబీ డివిలియర్స్, డుప్లెసిస్ లాంటి ఆటగాళ్లు టీమ్‌ఇండియాను సిరీస్ గెలవకుండా అడ్డుకున్నారు. అక్కడ భారత జట్టు పలుమార్లు మంచి ప్రదర్శన చేసినా ఎప్పుడూ సిరీస్ నెగ్గలేదు. అక్కడ చరిత్ర సృష్టించడానికి ఇదే మంచి అవకాశం"
-హర్భజన్ సింగ్, టీమ్‌ఇండియా వెటరన్ స్పిన్నర్
1992 నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమ్‌ఇండియా.. ఆ జట్టుపై ఇంతవరకు ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవలేదు. ఇప్పటివరకు సఫారీ గడ్డపై జరిగిన ఏడు టెస్ట్ సిరీసుల్లో కేవలం ఒక్క దానిని మాత్రమే డ్రా చేసుకోగలిగింది.
తొలుత ఈ పర్యటన ఈనెల 17 నుంచే ప్రారంభంకావాల్సి ఉండగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ నేపథ్యంలో వారం రోజులు వాయిదా పడింది. దీంతో ఈనెల 26 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. అనంతరం మూడు వన్డేల సిరీస్ జరగనుంది. అయితే తర్వాత జరగాల్సిన నాలుగు టీ20ల సిరీస్‌ను బీసీసీఐ ప్రస్తుతానికి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: టీమ్‌ఇండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ