ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య జరిగే రసవత్త పోరును ఎన్ని సార్లు చూసినా తనవి తీరదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోతారంతే. అయితే టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ, హార్దిక్ అద్భుత ప్రదర్శనతో టీమ్ఇండియా మర్చిపోలేని విజయాన్ని అందుకుంది. దీంతో భారత క్రికెట్ ప్రేమికులకు దీపావళి పండగ ఒక్కరోజు ముందుగానే వచ్చేసింది. ఒకేసారి రెండిటినీ కలిపి సంబరాలు చేసుకున్ననారు. అయితే ఈ క్రమంలోనే దీపావళి విషెస్ తెలుపుతూ పాక్‌తో జరిగిన మ్యాచ్‌కు సంబంధించి గూగుల్ సీఈఓ ఓ ట్వీట్ చేశారు. అది ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌ను తాను వీక్షించినట్లు తెలిపారు. అలాగే ఓ అభిమానికి కౌంటర్ వేశారు. ఏంటంటే..
'హ్యాపీ దీపావళి.. అందరు ఈ పండగను మీ ఫ్రెండ్స్, అలాగే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. నేను మాత్రం ఈ పండగను టీమ్ఇండియా ఇన్నింగ్స్ ఆఖరి మూడు ఓవర్లను మళ్లీ చూస్తూ సెలబ్రేట్ చేసుకుంటాను. అద్భుతమైన గొప్ప ప్రదర్శన' అంటూ సుందర్ ట్వీట్ చేశారు. అయితే మ్యాచ్ కోల్పోయిన బాధలో ఉన్న ఓ పాక్ అభిమానికి దానికి కామెంట్ చేశాడు. 'మొదటి మూడు ఓవర్లు చూడండి' అంటూ కామెంట్ చేయగా.. దానికి అదిరిపోయే రిప్లై ఇచ్చారు పిచాయ్. 'హా అది కూడా చూశాను. భువి, అర్షదీప్ స్పెల్ అద్భుతం' అని పాక్ ఇన్నింగ్స్‌ను ఉద్దేశించి తిరిగి కౌంటర్ వేశారు. ప్రస్తుతం నెట్టింట్లో ఇది వైరల్ అవుతోంది.
ఇదీ చూడండి: T20 worldcup: కోహ్లీ.. ఆ ఒక్కటి కూడా పూర్తి చేసేశాడుగా!