ETV Bharat / sports

ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్​గా గంగూలీ

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని(Sourav Ganguly News) ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్​గా అంతర్జాతీయ క్రికెట్ మండలి నియమించింది(ICC News). అలానే అఫ్గానిస్థాన్​ క్రికెట్​ కమిటీ పనితీరుపై సమీక్షించేందుకు అఫ్గాన్​ వర్కింగ్​ బోర్డును ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

ganguly
గంగూలీ
author img

By

Published : Nov 17, 2021, 1:27 PM IST

Updated : Nov 17, 2021, 3:03 PM IST

భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు​ గంగూలీకి(Sourav Ganguly News) కీలక బాధ్యతను అప్పగించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC News). ఐసీసీ పురుషుల​ క్రికెట్ కమిటీ ఛైర్మన్​గా ఆయనను నియమిస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో తొమ్మిదేళ్ల పాటు ఛైర్మన్​గా పనిచేసిన దిగ్గజ క్రికెటర్ అనిల్​ కుంబ్లే(Anil Kumble ICC) స్థానాన్ని దాదా భర్తీ చేయనున్నాడు.

"ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్​గా గంగూలీని నియమించడం ఆనందంగా ఉంది. బ్యాటర్​గా, క్రికెట్ పాలకుడిగా గంగూలీకి ఉన్న అనుభవం క్రికెట్​లో ఉత్తమ నిర్ణయాలు తీసుకునేలా దోహదపడాలని ఆశిస్తున్నాను. గత తొమ్మిదేళ్లుగా ఈ కమిటీ ఛైర్మన్​గా సేవలిందించిన అనిల్​ కుంబ్లేకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. డీఆర్​ఎస్​ అమలు సహా పలు నిర్ణయాల్లో కుంబ్లే పాత్ర కీలకం" అని ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్​క్లే చెప్పారు.

అఫ్గాన్​ వర్కింగ్ గ్రూప్..

అఫ్గానిస్థాన్​లో(Afghanistan Cricket News) తాలిబన్ల పాలన నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్గాన్​ క్రికెట్ బోర్డు కార్యాచరణను సమీక్షించేందుకు ఓ వర్కింగ్ గ్రూప్​ను ఏర్పాటు చేసింది. ఇమ్రాన్ ఖ్వాజా(ఛైర్మన్), రాస్ మెక్​కలమ్, లాసన్ నైడో, రమీజ్ రాజాను గ్రూప్​ సభ్యులుగా నియమించింది. మరికొన్ని నెలల్లో ఈ గ్రూప్​.. నివేదికను సమర్పించనుంది. అఫ్గాన్​ పురుషుల, మహిళల జట్టును ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది ఐసీసీ.

ఐసీసీ మహిళల క్రికెట్ కమిటీ..

మహిళల జట్లలోనూ ఫస్ట్​ క్లాస్, లిస్ట్​ ఏ విభాగాలుంటాయని ఐసీసీ తెలిపింది. ఐసీసీ ఉమెన్​ క్రికెట్​ కమిటీలో వెస్టిండీస్​ క్రికెట్ కమిటీ సీఈఓ జానీ గ్రేవ్​ను నియమించినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:

ప్రేమించిన వాళ్లే పక్కనపెడితే ఎలా?.. సన్​రైజర్స్​​పై వార్నర్

IND vs NZ: భారత్​తో టీ20 సిరీస్​కు కివీస్​ స్టార్ పేసర్ దూరం

Last Updated : Nov 17, 2021, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.