ETV Bharat / sports

బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా.. క్రికెట్​లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడంటే?

బీసీసీఐ అధ్యక్షుడిగా తన పదవీకాలంలో గంగూలీ.. క్రికెట్​లో పలు మార్పులు తీసుకొచ్చాడు. అతడు బాధ్యతలు తీసుకున్నాక కరోనా పెద్ద సవాల్​గా మారినా దానిని అధిగమించి టీమ్​ఇండియాను ముందుకు నడిపించాడు. ఓ సారి అతడు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? అవి ఆటపై ఎలాంటి ప్రభావం చూపాయి తెలుసుకుందాం..

Ganguly Achievements As Bcci president
బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా క్రికెట్​లో తెచ్చిన మార్పులు ఏంటంటే?
author img

By

Published : Oct 14, 2022, 10:25 AM IST

బీసీసీఐలో గంగూలీ శకం ముగియనుంది. బోర్డు కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్, 1983 ప్రపంచకప్ హీరో రోజర్​ బిన్నీ బీసీసీఐ పగ్గాలను అందుకోనున్నాడు. ఈ నెల 18న ముంబయిలో జరిగే బోర్డు ఏజీఎమ్​లో బిన్నీ అధికారికంగా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న దాదా.. తన పదవీ కాలంలో తీసుకున్న నిర్ణయాలతో క్రికెట్​లో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎలాంటి ప్రభావం చూపాయి తెలుసుకుందాం..

పింక్ బాల్ టెస్ట్​.. 2019లో బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన గంగూలీ.. తనదైన మార్క్ చూపించాడు. టీమ్​ఇండియా కెప్టెన్‌గా భారత జట్టులో ఎలాంటి విప్లవాన్ని తీసుకొచ్చాడో.. బోర్డు అధ్యక్షుడిగా కూడా అదే దూకుడును కొనసాగించాడు. అయితే ప్రెసిడెంట్‌గా అతని కాలంలో కరోనా మహమ్మారి పెద్ద సవాల్‌గా మారగా.. బోర్డు అంతర్గత వ్యవహారాలు అతడిని కాస్త ఇబ్బంది పెట్టాయి.

ఏదేమైనప్పటికీ బోర్డు అధ్యక్షుడిగా దాదా మంచి మార్పులే తీసుకొచ్చాడు. వచ్చి రావడంతోనే అప్పటి వరకు పింక్ బాల్ టెస్ట్‌కు దూరంగా ఉన్న భారత జట్టును ఆ దిశగా నడిపించాడు. 2019లో కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్‌తో పింక్ బాల్ టెస్ట్ నిర్వహించి... టెస్ట్ క్రికెట్ ఆదరణ పెంచడంలో సక్సెస్ అయ్యాడు.

వేతనాల పెంపు.. దేశవాళీ క్రికెట్​ వేతనాలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతేకాకుండా మాజీ క్రికెటర్లకు బోర్డు నుంచి రావాల్సిన బకాయిలన్నింటినీ దాదాపుగా క్లియర్ చేశాడు! బోర్డు అడ్మినిస్ట్రేషన్‌లోకి తన సహచరులు రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్మణ్‌లను ఒప్పించి తీసుకొచ్చాడు.

రెండు జట్లతో ఒకేసారి.. ఒకే సమయంలో రెండు జట్లను ఆడించి బోర్డు రెవెన్యూను రెట్టింపు చేశాడు. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన ఆటగాళ్లతో ద్వితీయ శ్రేణి జట్టును సిద్ధం చేసి.. ద్రవిడ్, లక్మణ్‌లను కోచ్‌‌లుగా పంపించి సక్సెస్‌ఫుల్‌గా సిరీస్‌లను పూర్తి చేశాడు.

సక్సెస్​ఫుల్​గా ఐపీఎల్​.. దాదాకు కరోనా పెద్ద సవాల్​గా మారింది. ప్రపంచ క్రికెట్ ఆగిపోయిన సందర్భంలో కఠిన బయో బబుల్స్‌తో దుబాయ్ వేదికగా ఐపీఎల్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించి ఇతర ఏ బోర్డులకు రానీ ఆదాయాన్ని తెచ్చేలా చేశాడు. ఐపీఎల్ 2021ను స్వదేశంలో నిర్వహించాలని భావించినప్పటికీ.. బయో బబుల్ బ్రేక్ కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో రెండు దఫాలుగా నిర్వహించి విజయవంతమయ్యాడు. అంతర్జాతీయా క్రికెట్ షెడ్యూల్‌లో మళ్లీ ఐపీఎల్‌కు టైమ్ తీసుకొని దుబాయ్ వేదికగా సెకండాఫ్ నిర్వహించాడు. మొత్తంగా ఐపీఎల్ 2022ను సొంతగడ్డపై విజయవంతంగా ముగించాడు.

ఐపీఎల్​ ప్రసార హక్కులు.. ఐపీఎల్​ టీవీ డిజిటల్​ హక్కుల ధరలు రికార్డు స్థాయిలో రూ.46 వేల కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ క్రెడిట్​ దాదాకే చెల్లుతుంది.

మహిళల క్రికెట్​ను ప్రోత్సహించేలా.. భారత్​లో మహిళల క్రికెట్​ను మరింత ప్రోత్సాహించే దిశగా అడుగులు వేశాడు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉమెన్స్‌ ఐపీఎల్‌.. కార్యరూపం దాల్చేందుకు శ్రీకారం చుట్టాడు. ఈ లీగ్​ 5 జట్లతో వచ్చే ఏడాది మార్చిలో పురుషుల ఐపీఎల్​కు ముందు జరగనుంది. ఈ లీగ్ దశలో 20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

మరోవైపు అండర్‌15 వన్డే టోర్న్​మెంట్​ ప్రారంభించేలా చర్యలు తీసుకున్నాడు. ఈ టోర్నీని డిసెంబరు 26 నుంచి జనవరి 12 వరకు బెంగళూరు, రాంచి, రాజ్​కోట్​, ఇండోర్​, రాయ్​పూర్​, పుణెలో నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి: సచిన్​లా అలా చేయాలని ఆశించా.. కానీ అది చాలా కష్టం: ధోనీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.