Gambhir Quits LSG : టీమ్ఇండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్.. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీకి గుడ్‌బై చెప్పాడు. గత రెండు సీజన్లలో ఎల్ఎస్జీ జట్టుకు మెంటార్‌గా ఉన్న గంభీర్.. తాజాగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతడు మళ్లీ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో చేరనున్నాడు. 2024 ఐపీఎల్లో కేకేఆర్‌కు గంభీర్ సేవలందిచనున్నాడు. ఈ విషయాన్ని గంభీర్ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించాడు. కాగా, గంభీర్ మార్గనిర్దేశంలో లఖ్‌నవూ 2022లో ఫైనల్‌కు చేరగా.. 2023లో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.
"లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో నా ప్రయాణం ముగిసిందని ప్రకటిస్తున్నాను. ఈ జర్నీని చిరస్మరణీయం చేసిన ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్టింగ్ స్టాఫ్, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు సపోర్ట్‌గా ఉన్న ఫ్రాంఛైజీ యజమాని డా.సంజీవ్ గోయెంకాకు ప్రత్యేక ధన్యవాదాలు. మున్ముందు జట్టు అద్భుత విజయాలు నమోదు చేస్తుందని, ప్రతీ లఖ్‌నవూ అభిమాని గర్వపడేలా చేస్తుందని అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఎస్ఎస్జీ" అని ట్విట్టర్లో రాసుకొచ్చాడు. కాగా, గంభీర్ మార్గనిర్దేశంలో లఖ్‌నవూ 2022లో ఫైనల్‌కు చేరగా.. 2023లో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.
-
I’m back. I’m hungry. I’m No.23. Ami KKR ❤️❤️ @KKRiders pic.twitter.com/KDRneHmzN4
— Gautam Gambhir (@GautamGambhir) November 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">I’m back. I’m hungry. I’m No.23. Ami KKR ❤️❤️ @KKRiders pic.twitter.com/KDRneHmzN4
— Gautam Gambhir (@GautamGambhir) November 22, 2023I’m back. I’m hungry. I’m No.23. Ami KKR ❤️❤️ @KKRiders pic.twitter.com/KDRneHmzN4
— Gautam Gambhir (@GautamGambhir) November 22, 2023
Guatam Gambhir IPL Career : గంభీర్ ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ ( అప్పటి దిల్లీ డేర్ డెవిల్స్), కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. అతడి నేతృత్వంలో కోల్‌కతా.. 2012, 2014లో ఛాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్లో గంభీర్ 154 మ్యాచ్‌ల్లో 4217 పరుగులు చేశాడు. ఇక రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత గంభీర్.. కోల్‌కతాకు పలు సీజన్లలో మెంటార్‌గా వ్యవహరించాడు. గత రెండేళ్ల కింద ఎల్ఎస్జీ ఫ్రాంచైజీతో చేరిన విషయం తెలిసిందే.
Lucknow Super Giants Coach : ఇక ఇటీవల లఖ్‌నవూ సూపర్ జెయింట్స్.. ఎస్. శ్రీరామ్‌ను కొత్త అసిస్టెంట్ కోచ్‌గా నియమించుకుంది. 2024 ఐపీఎల్లో లఖ్‌నవూ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్‌తో కలిసి శ్రీరామ్ పనిచేయనున్నారు. వీరిద్దరూ గతంలో ఆస్ట్రేలియా జట్టుకు కలిసి పనిచేశారు.
IPL 2024 : బాంగర్ పోయే.. అండీ వచ్చే.. RCBకి కొత్త కోచ్.. ఈ సారైనా కప్పు కొట్టేనా?
కొత్త కోచ్ వేటలో సన్‌రైజర్స్.. బ్రియన్ లారాకు బైబై.. అతడిపై ఆసక్తి!