భారత్‌లో క్రికెట్‌కు ఉండే క్రేజే వేరు. ఇష్టమైన క్రికెటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపుతారు. వారి భాగస్వాములు, పిల్లల గురించి నెట్లో ఆరా తీస్తారు. ఇటీవలే జన్మించిన తన కుమార్తెకు వామిక (Vamika Kohli) అని పేరు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. అయితే వామికతో పాటు ఇతర స్టార్ క్రికెటర్ల పిల్లల పేర్లకు ప్రత్యేకించి కొన్ని అర్థాలున్నాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?
వామిక కోహ్లీ..
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma baby).. 2021 జనవరి 11న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు 'వామిక' అని పేరు (Virat Kohli Daughter) పెట్టారు. అంటే దుర్గా దేవీ అని అర్థం. దేవతకు మరో పేరు. అంతేకాక, వామిక (VAMIKA) అనే పేరు... విరాట్ (virat)లోని మొదటి అక్షరం.. Vతో మొదలై.. అనుష్క (anushka)లోని చివరి రెండు అక్షరాలు KAతో పూర్తవడం విశేషం.

జీవా ధోనీ..

టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ, సాక్షిల ముద్దుల కూతురు జీవా (Dhoni Daughter). ఈ చిన్నారికి సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. మైదానంలో తన అల్లరికి, ఇంట్లో తండ్రితో చేసే సరదాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. జీవా అనే పేరుకు.. ప్రకాశవంతమైనది, కాంతివంతమైనదనే అర్థాలున్నాయి.
గంభీర్ కూతుళ్లు ఆజీన్, అనైజా..

టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌కు (Dautam Gambhir Daughter) ఇద్దరు కుమార్తెలు. వారి పేర్లు ఆజీన్, అనైజా. ఆజీన్ అంటే.. అందమైనది, సౌందర్యం అని అర్థం. అనైజా అంటే గౌరవప్రదమైనదని అర్థం.
ఆగస్త్య పాండ్య..

ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, నటాషా స్టాంకోవిక్లకు 2020 జులైలో మగ బిడ్డ జన్మించాడు. అతడి పేరు అగస్త్య (Hardik Pandya Son Name). అదో రుషి నామం. దానికి అర్థం.. పర్వతం కన్నా అణుకువగా, వినయంగా ఉండేవాడని.
సమైరా..

టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ, రితికల ముద్దుల కూతురు సమైరా (Rohit Sharma Daughter). 2019లో ఈ పాప జన్మించింది. సమైరా అంటే.. మంత్రముగ్ధులను చేసేది, దేవుడు కాపాడేది అని అర్థాలున్నాయి.
ఇవీ చూడండి:
కోహ్లీ కుమార్తెకు రేప్ వార్నింగ్.. కేసుపై సుమోటో విచారణ