ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందని సామెత. టీమ్ఇండియా క్రికెటర్లను చూస్తుంటే అది నిజమనే అనిపిస్తుంది. స్టార్ ఆటగాళ్లు ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ భార్యలు ప్రపంచం మొత్తానికి తెలుసు. వారు తమ భాగస్వాములకు అన్ని సందర్భాలలోనూ మద్దతుగా నిలిచారు.
కానీ జట్టులో కీలకంగా మారి కెరీర్లో విజయవంతంగా దూసుకెళ్తోన్న జడేజా, రహానె, ఇషాంత్ శర్మ వంటి పలువురు ఆటగాళ్ల సతీమణుల గురించి మీకు తెలుసా? వారెలా ఉంటారో కూడా చాలా మందికి తెలీదు. ఎందుకంటే వారు సోషల్‌మీడియాలో కొంచెం తక్కువగానే కనిపిస్తారు. అయితే వారు అందంతో పాటు తెలివితేటల్లోనూ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోరు. మరి వారెవరో తెలుసుకుందాం.
రవీంద్ర జడేజా
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య పేరు రివాబా. ఓ స్టార్ క్రికెటర్ భార్య అయినప్పటికీ తన వ్యక్తిగత జీవితాన్ని మీడియాకు దూరంగా ఉంచుకోవడానికే ఈమె ఎక్కువ ఇష్టపడుతుంది!. వీరిద్దరికీ 2016లో వివాహం జరిగింది. రాజ్‌కోట్ అత్మియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి రివాబా మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందింది.
అజింక్యా రహానె
రహానె.. టీమ్ఇండియా టెస్టు జట్టుకు వైస్‌కెప్టెన్. ఎంత ఒత్తిడిలో ఉన్నా కూల్‌గా బ్యాటింగ్ చేస్తుంటాడు. కోహ్లీ గైర్హాజరీలోనూ జట్టును అద్భుతంగా నడిపించి గొప్ప నాయకుడిగా ప్రశంసలు దక్కించుకున్నాడు. అతడి సతీమణి పేరు రాధిక. చిన్ననాటి నుంచి వీరిద్దరు స్నేహితులు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈమె.. రహానె కెరీర్ ఎత్తుపల్లాలో అతడికి తోడుగా ఉండి ముందుండి నడిపించింది. సోషల్‌మీడియాలో కాస్త చురుగ్గా ఉన్నప్పటికీ చాలా తక్కువ మందికే ఈమె గురించి తెలుసు.
ఇషాంత్ శర్మ
స్టార్ బౌలర్ ఇషాంత్ శర్మ భార్య పేరు ప్రతిమా సింగ్. వీరు ప్రేమించుకుని కుటుంబసభ్యుల సమక్షంలో 2016లో వివాహం చేసుకున్నారు. ఈమె భారత జాతీయ బాస్కెట్‌బాల్ జట్టులో సభ్యురాలు. నోయిడాలోని జెనెసిన్ గ్లోబల్ స్కూల్లో చీఫ్ స్పోర్ట్ అడ్వైజర్‌గానూ వ్యవహరిస్తోంది.
ఇర్ఫాన్ పఠాన్
భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్. అయితే అతడి భార్య సఫా బేగ్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దాదాపు పదేళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న వీరిద్దరికీ 2016లో పెళ్లి జరిగింది. వివాహానికి ముందు అరేబియాలో ఆమె ఓ ప్రముఖ మోడల్. ప్రస్తుతం ఓ పీఆర్ సంస్థలో ఎగ్జిక్యూటిగ్ ఎడిటర్‌గా పనిచేస్తోంది.
ఉమేశ్ యాదవ్
టీమ్ఇండియా యువ పేసర్ ఉమేశ్ యాదవ్ సతీమణి తాన్యా వాధ్వ. ఈమె ఫ్యాజన్ డిజైనర్. మూడేళ్ల పాటు డేటింగ్ చేసి 2013, మే 29న ఒక్కటయ్యారు.
భువనేశ్వర్ కుమార్
పేసర్ భువనేశ్వర్ కుమార్ భార్య నుపుర్. ఇంజినీర్ అయిన ఈమె నొయిడాలోని ఓ మల్టీనేషనల్ సంస్థలో ఉద్యోగినిగా సేవలందించారు.
ఇదీ చూడండి: ఈ క్రికెటర్ల భార్యలు ఏం చేస్తుంటారో తెలుసా?